ధాన్యం బకాయిలు చెల్లించాలి

Jul 23 2021 @ 00:18AM
ఏలూరులో కలెక్టరేట్‌ వద్ద ధర్నా

ఏలూరు, నరసాపురంలలో నిరసనలు



ఏలూరు కలెక్టరేట్‌/నరసాపురం, జూలై 22: ధాన్యం, మొక్క జొన్న బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ అఖిలపక్ష రైతు సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వ ర్యంలో గురువారం కలెక్టరేట్‌ వద్ద వర్షంలో సైతం తడుస్తూ ధర్నా నిర్వహించారు. పురుగు మందుడబ్బాలు, వరినారుతో నిరస న వ్యక్తం చేశారు. టీడీపీ, సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్‌, సీపీఐ ఎంఎల్‌ న్యూడెమోక్రసీ, ఇప్టూ, సీఐటీయూ, ఏఐటీయూసీ తదితర కార్మిక సంఘాలు, దళిత సంఘాలు మద్దతు ప్రక టించాయి. టీడీపీ ఏలూరు పార్లమెంటు అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌, రైతుసంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్‌, తెలుగు రైతు నర్సాపురం పార్లమెంటు అధ్యక్షుడు పాతూరి రాంప్రసాద్‌ చౌదరి, తెలుగు రైతు ఏలూరు పార్లమెంటు అధ్యక్షుడు గుత్తా వెంకటేశ్వరరావు, సీపీఐ కార్యదర్శి డేగా ప్రభాకర్‌, సిటీ కాంగ్రెస్‌ అద్యక్షుడు రాజనాల రామ్మోహనరావు మాట్లాడుతూ రబీధాన్యం, మొక్కజొన్న పంటలకు నెలలు గడుస్తున్నా బకా యి సొమ్ములు చెల్లించకపోవడం దారుణమని విమర్శిం చారు. అనంతరం డీఆర్‌వో  డేవిడ్‌ రాజుకు వినతిపత్రం అం దజేశారు. రైతుల ధాన్యం సొమ్ములు తక్షణం చెల్లించాలని కోరుతూ పాలకొల్లు ఎమ్మెల్యే డాక్టర్‌ నిమ్మల రామానాయు డు, ఎమ్మెల్సీ అంగర రామమోహన్‌ ఆధ్వర్యంలో రైతులు, టీడీపీ కార్యకర్తలతో గురువారం పాలకొల్లు నుంచి నరసా పురం సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం వరకు 15 కిలోమీటర్ల మేర జోరువానలో రైతుల మహా పాదయాత్ర నిర్వహించారు. కంచాలపై గరిటలతో కొడుతూ నిరసన తెలిపారు.


Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.