ధాన్యం కొనుగోలులో భారీ అవినీతి

ABN , First Publish Date - 2022-05-21T07:20:05+05:30 IST

రాష్ట్రంలో రైతుభరోసా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోళ్లలో కోట్లాది రూపాయల అవి నీతి జరిగిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్‌ఎన్‌ వర్మ ఆరోపించారు.

ధాన్యం కొనుగోలులో భారీ అవినీతి

పిఠాపురం, మే 20: రాష్ట్రంలో రైతుభరోసా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోళ్లలో కోట్లాది రూపాయల అవి నీతి జరిగిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్‌ఎన్‌ వర్మ ఆరోపించారు. పిఠాపురంలోని టీడీపీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆర్బీకేల వద్ద కనీస మద్దతు ధర రైతులకు దక్కనీయకుండా చేయకుండా చేయడంతోపాటు దళారులు బస్తాకు రూ.500 వరకూ లాక్కుంటున్నారన్నారు. సాక్షాత్తూ వైసీపీ ఎంపీ ధాన్యం కొనుగోలులో అవినీతి జరుగుతుందని చెబుతుంటే, మంత్రి లేదని చెప్పడం విడ్డూరంగా ఉంద న్నారు. రైతుల నుంచి ధాన్యం కొనడంలో జరుగుతున్న అవినీతిని తాము గత మూడేళ్లుగా సాక్ష్యాధారాలతో బయటపెట్టామని, అధికారుల దృష్టికి తీసుకువెళ్లామని గుర్తుచేశారు. ప్రస్తుత సీజన్‌లో 34.47 లక్షల టన్నుల ధాన్యం కొనాలన్నది లక్ష్యం కాగా ఇప్ప టివరకూ కేవలం 14 లక్షల టన్నులు మాత్రమే కొన్నారని, మిగిలిన ధాన్యం రైతులు ఎక్కడ అమ్ముకుంటారని ప్రశ్నించారు. మిల్లర్లు, వైసీపీ దళారులు రైతులు నుంచి ధాన్యాన్ని తక్కువ ధరకు కొని అధిక ధరకు విక్రయిస్తున్నారని తెలిపారు. తేమ పేరుతో రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. రైతుల వద్ద నుంచి ధాన్యం కొనుగోలుకు జగన్‌ ఇస్తామన్న వెయ్యి కోట్లు ఏమయ్యాయని నిలదీశారు. రైతుల ఇన్స్యూరెన్స్‌ డబ్బులను వైసీపీ నాయకులు స్వాహా చేశారని ఆరోపించారు. ఎరువులు, విత్తనాలు బ్లాక్‌మార్కెట్‌లో విక్రయిస్తున్నారని తెలిపారు. రైతులకు అందుబాటులో ఉండకపోవడంతో వీటిని అధిక ధరలకు కొనాల్సిన పరిస్థితులున్నాయని చెప్పారు. నకిలీ వరివిత్తనాల వల్ల 25 వేల ఎకరాల్లో వరిపంటను రైతులు నష్టపోయారని, వారికి ఇప్పటివరకూ పరిహా రం అందలేదని తెలిపారు. మంత్రి ముందు క్షేత్రస్థాయిలో పరిస్థితులు తెలుసుకుని మాట్లాడాలని హిత వు పలికారు. అవినీతిని ప్రోత్సహిస్తున్న వైసీపీ ప్రభు త్వం తక్షణం గద్దె దిగాలని వర్మ డిమాండ్‌ చేశారు. సమావేశంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు రెడ్డెం భాస్కరరావు, గుండ్ర సుబ్బారావు, బర్ల అప్పారావు, కొండేపూడి ప్రకాష్‌, నామా దొరబాబు, నల్లా శ్రీనివాస్‌, కొరుప్రోలు శ్రీను, శీరం మాణిక్యం, దుగ్గాడ విజయలక్ష్మి, బస్సా సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-21T07:20:05+05:30 IST