ధాన్యం కొనుగోలు చేసేదెప్పుడో?

ABN , First Publish Date - 2020-12-04T04:08:16+05:30 IST

మండలంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రారం భం కాలేదు. కేంద్రాలు ప్రారంభించి ఐదు రోజులు గడు స్తున్నా ఇప్పటివరకూ గింజ కూడా కొనుగోలు చేయలే దు. ముందస్తు వరి ఉడుపులు కావడంతో మండలంలో దాదాపు అన్ని ప్రాంతాల్లో కోతలు పూర్తయ్యాయి.

ధాన్యం కొనుగోలు చేసేదెప్పుడో?
కల్లాల్లో ధాన్యం నిల్వలు


జలుమూరు, డిసెంబరు 3: మండలంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రారం భం కాలేదు. కేంద్రాలు ప్రారంభించి ఐదు రోజులు గడు స్తున్నా ఇప్పటివరకూ గింజ కూడా కొనుగోలు చేయలే దు. ముందస్తు వరి ఉడుపులు కావడంతో మండలంలో దాదాపు అన్ని ప్రాంతాల్లో కోతలు పూర్తయ్యాయి. ఎక్కు వ శాతం యంత్రాలు వినియోగించడంతో కల్లాల్లో ధాన్యం నిల్వలు పేరుకుపోయాయి. మండలంలో ఐదు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేశారు. ధాన్యం విక్ర యానికి సంబంధించి రైతులు సచివాలయాల్లో వ్యవసా య సహాయకుల వద్ద రిజిసే్ట్రషన చేసుకున్నారు. మం డల వ్యాప్తంగా 3400 మంది రైతులు రిజిసే్ట్రషన చేసు కున్నా..అధికారులు కొనుగోలు ప్రక్రియ ప్రారంభించ లేదు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై తహసీల్దారు జామి ఈశ్వరమ్మ వద్ద ప్రస్తావిస్తే ప్రభు త్వం ప్రకటించిన మద్దతు ధర చెల్లించి రైతుల నుంచి ధాన్యం కొనుగోలుకు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు.





Updated Date - 2020-12-04T04:08:16+05:30 IST