Salman Rushdie ex wife Padma Lakshmi: తన మాజీ భర్త సల్మాన్ రష్దీ గురించి పద్మాలక్ష్మీ ఏం చెప్పిందంటే...

ABN , First Publish Date - 2022-08-16T15:15:35+05:30 IST

భారత సంతతికి చెందిన వివాదాస్పద నవలా రచయిత సల్మాన్‌ రష్దీ కత్తిపోట్లకు గురైన నేపథ్యంలో ఆయన మాజీ భార్య భారతీయ అమెరికన్ మోడల్, టీవీ హోస్ట్, రచయిత్రి పద్మా లక్ష్మి...

Salman Rushdie ex wife Padma Lakshmi: తన మాజీ భర్త సల్మాన్ రష్దీ గురించి పద్మాలక్ష్మీ ఏం చెప్పిందంటే...

లాస్ ఏంజెల్స్: భారత సంతతికి చెందిన వివాదాస్పద నవలా రచయిత సల్మాన్‌ రష్దీ కత్తిపోట్లకు గురైన నేపథ్యంలో ఆయన మాజీ భార్య భారతీయ అమెరికన్ మోడల్, టీవీ హోస్ట్, రచయిత్రి పద్మా లక్ష్మి(Padma Lakshmi) ఆలస్యంగా ట్వీట్(tweeted) చేశారు.(Salman Rushdie ex wife Padma Lakshmi) అమెరికా దేశంలోని న్యూయార్క్‌(New York) నగరంలో కత్తిపోటు ఘటన తర్వాత సల్మాన్ రష్దీ(Salman Rushdie) త్వరగా కోలుకోవాలని పద్మా లక్ష్మి ఆకాంక్షించారు.పద్మాలక్ష్మీ 2004వ సంవత్సరంలో సల్మాన్ రష్దీని వివాహమాడారు.






నాలుగేళ్లపాటు రష్దీతో కాపురం చేసిన పద్మాలక్ష్మీ

 పెళ్లి అనంతరం సల్మాన్ రష్దీతో నాలుగేళ్ల పాటు కాపురం చేసిన పద్మాలక్ష్మీ(Indian American model, TV host, author and activist Padma Lakshmi) కత్తిపోటు సంఘటన జరిగిన రెండు రోజుల తర్వాత ట్వీట్ చేశారు. నాలుగేళ్ల తర్వాత రష్దీ, పద్మాలక్ష్మీలు విడిపోయారు. (ex husband Salman Rushdie)‘‘శుక్రవారం కత్తిపోటు ఘటన తర్వాత సల్మాన్ రష్దీ కోలుకుంటున్నారు, ఇప్పుడు ఆయన  త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను’’ అని పద్మాలక్ష్మీ ట్వీట్ లో పేర్కొన్నారు.


పద్మాలక్ష్మీ సల్మాన్ రష్దీకి నాల్గవ భార్య

పద్మాలక్ష్మీ సల్మాన్ రష్దీకి నాల్గవ భార్య.(Padma was Rushdie's fourth wife) రష్దీ గతంలో జాఫర్ తల్లి క్లారిస్సా లువార్డ్, ఎలిజబెత్ వెస్ట్‌ లను వివాహం చేసుకున్నాడు.రష్దీతో అతని 23 ఏళ్ల కుమారుడు మిలన్ రష్దీ ఉన్నాడు. తన తండ్రి గురించి కుటుంబం తరపున అతని పెద్ద  కుమారుడు జాఫర్ రష్దీ ఒక ప్రకటన చేశాడు."నా తండ్రి ఆసుపత్రిలో విస్తృతమైన వైద్య చికిత్స పొందుతున్నపుడు మొదట్లో పరిస్థితి విషమంగా ఉంది," అని జాఫర్ చెప్పాడు.‘‘నా తండ్రికి వెంటిలేటర్ తొలగించినప్పుడు మేం చాలా ఉపశమనం చెందాం,  నా తండ్రి మాట్లాడుతున్నాడు’’ అని సల్మాన్ రష్దీ పెద్ద కుమారుడు జాఫర్ రష్దీ చెప్పారు.


Updated Date - 2022-08-16T15:15:35+05:30 IST