
గువహాటి: అస్సాంకు చెందిన పద్మశ్రీ అవార్డు పొందిన ఒక వ్యక్తి అత్యాచార కేసులో ఇరుక్కున్నరాు. ఆయనపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఆయన సంరక్షణలో ఉన్న ఒక మైనర్ బాలికపై ఏడాది కాలంగా అత్యాచారం కొనసాగిస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. సదరు బాధితురాలికి ఆయన పెంపుడు తండ్రి. అయితే ఈ కేసులో అరెస్టైన ఆయనకు జిల్లా బాలుర సంక్షేమ కమిటీ వేసిన కౌంటర్ పిటిషన్ వల్ల మధ్యంతర బెయిల్ లభించింది. కాగా, సదరు వ్యక్తిని కఠినంగా శిక్షించాలని, అంతే కాకుండా పద్మశ్రీని వెనక్కి తీసుకోవాలని పౌర హక్కుల సంఘాలు, నెటిజెన్లు డిమాండ్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి