పెయిడ్‌ చానల్‌ ‘గిఫ్ట్‌’ ఇవ్వొచ్చు!

ABN , First Publish Date - 2022-05-14T08:39:03+05:30 IST

యూట్యూబ్‌ కొత్తగా గిఫ్ట్‌ ఫీచర్‌ని ప్రవేశపెడుతోంది. అటు ఫ్యాన్స్‌ ఇటు క్రియేటర్లు ఎవరైనాసరే తమకు కావాల్సిన వారికి పెయిడ్‌ చానల్‌

పెయిడ్‌ చానల్‌ ‘గిఫ్ట్‌’ ఇవ్వొచ్చు!

యూట్యూబ్‌ కొత్తగా గిఫ్ట్‌ ఫీచర్‌ని ప్రవేశపెడుతోంది. అటు ఫ్యాన్స్‌ ఇటు క్రియేటర్లు ఎవరైనాసరే తమకు కావాల్సిన వారికి పెయిడ్‌ చానల్‌ సబ్‌స్ర్కిప్షన్‌ను గిఫ్ట్‌గా ఇచ్చుకోవచ్చు. ఎన్‌గాడ్జెట్‌ నివేదిక ప్రకారం పేరున్న  పలువురు స్ర్టీమర్లు ఈ విషయాన్ని ట్వీట్‌ చేశారట. రెవెన్యూ జనరేషన్‌ అలాగే కమ్యూనిటీ ఏర్పాటు చేసుకునేందుకు ఈ స్కీమ్‌ ఉపయోగపడుతుందని ఈ కంటెంట్‌ స్ట్రీమర్లు భావిస్తూ ఉండటం గమనార్హం. 


నిజానికి ఇదేమీ కొత్త స్కీమ్‌ కాదు. యూట్యూబ్‌ గేమింగ్‌కు ప్రధాన పోటీదారుగా ఉన్న ‘ట్విచ్‌’ ఇప్పటికే ఈ స్కీమ్‌ను ఆరంభించింది.  యూట్యూబ్‌ నుంచి ఇలాంటి స్కీమ్‌ వస్తుందని చాలాకాలంగా అనుకుంటున్నదే. ఈ ఏడాది మొదట్లోనే జపాన్‌లో యూట్యూబ్‌ దీన్ని టెస్ట్‌ చేసింది. ప్రస్తుతానికి ఇది బేటా దశలోనే ఉంది. అమెరికా, బ్రిటన్‌లోని యూట్యూబ్‌ గేమింగ్‌ యూజర్లకు ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. 

తమ ఫేవరేట్‌ క్రియేటర్ల నుంచి ఎక్స్‌క్లూజివ్‌గా కంటెంట్‌ పొందేందుకు అభిమానులు కట్టాల్సిన చందా సుమారుగా రూ.385. ట్విచ్‌తో పోటీపడేందుకు యూట్యూబ్‌ గేమింగ్‌ కూడా రీడైరెక్ట్స్‌ అంటే ఇతర స్ట్రీమర్ల లేదంటే ప్రీమియర్స్‌కు చెందినవి స్ట్రీమర్లు రీడైరెక్ట్‌ చేసే అవకాశాన్ని అందిస్తుంది.

మరో విషయం ఏమంటే పెద్ద సంఖ్యలో హైప్రొఫైల్‌ స్ట్రీమర్లు ట్విచ్‌ని కాదనుకుని యూట్యూబ్‌ గేమింగ్‌పై ఆసక్తి కనబరుస్తున్నారు. అయినప్పటికీ గత నెలలో ట్విచ్‌దే పైచేయిగా ఉంది. ట్విచ్‌ పార్టనర్ల రెవెన్యూ మాత్రం కటింగ్‌ కనిపించింది. ట్విచ్‌ పార్టనర్లు తమ రెవెన్యూని 70 నుంచి 50 శాతానికి తగ్గించుకున్నారని, ఆ కారణంగానే వారి వాటాల్లో తగ్గుదల కనిపిస్తోందని కొన్ని నివేదికలు చెబుతున్నాయి.  

మరోవైపు స్ట్రీమర్ల ఆదాయం నుంచి ‘యూట్యూబ్‌ గేమింగ్‌’  30 శాతాన్ని మాత్రమే వసూలు చేస్తోంది. అందుకే ట్విచ్‌ నుంచి స్ట్రీమర్లు వెళ్ళిపోవడం అంటూ జరిగితే యూట్యూబ్‌ గేమింగ్‌ పరపతి పెరుగుతుంది. 

Read more