పెళ్లయి 17 ఏళ్లయినా పిల్లలు పుట్టడం లేదని ఓ భర్త నిర్వాకమిది.. సరదాగా అంటున్నాడని భార్య అనుకుంది.. కానీ..

ABN , First Publish Date - 2022-05-19T21:38:31+05:30 IST

ఆ దంపతులిద్దరికీ కొన్నేళ్ల క్రితమే పెళ్లైంది. అయినా ఆ భార్యభర్తలు తల్లిదండ్రులు కాలేకపోయారు. ఈ క్రమంలోనే పుట్టింటికి వెళ్లిన భార్యకు.. అతడు ఫోన్ చేశాడు. ఫోన్‌లో భర్త చెప్పింది విని.. ఆమె లైట్ తీసుకుంది.

పెళ్లయి 17 ఏళ్లయినా పిల్లలు పుట్టడం లేదని ఓ భర్త నిర్వాకమిది.. సరదాగా అంటున్నాడని భార్య అనుకుంది.. కానీ..

ఇంటర్నెట్ డెస్క్: ఆ దంపతులిద్దరికీ కొన్నేళ్ల క్రితమే పెళ్లైంది. అయినా ఆ భార్యభర్తలు తల్లిదండ్రులు కాలేకపోయారు. ఈ క్రమంలోనే పుట్టింటికి వెళ్లిన భార్యకు.. అతడు ఫోన్ చేశాడు. ఫోన్‌లో భర్త చెప్పింది విని.. ఆమె లైట్ తీసుకుంది. ఆటపట్టించడానికి అలా మాట్లాడుతున్నాడేమో అనుకుంది. కానీ భర్త తనకు నిజంగానే షాకిచ్చాడని తర్వత ఆమెకు అర్థమైంది. ఇంతకూ ఏం జరిగిందనే వివరాల్లోకి వెళితే..



చత్తీస్‌గఢ్‌లోని జష్పూర్ జిల్లాకు చెందిన ఓ మహిళకు ఇల్తాఫ్ ఆలం అనే వ్యక్తితో 2005లో వివాహం జరిగింది. పెళ్లై ఏళ్లు గడిచాయే తప్ప ఆ దంపతులు తల్లిదండ్రులు కాలేకపోయారు. ఈ క్రమంలోనే పిల్లల విషయంలో సదరు మహిళపై అత్తింటి వేధింపులు ఎక్కువయ్యాయి. మహిళనే టార్గెట్ చేయడంతో ఆమె కీలక నిర్ణయం తీసుకుంది. ఎవర్నైనా అనాథను దత్తత తీసుకుంటామని అత్తింటి సభ్యులకు వెల్లడించింది. అయితే అందుకు వాళ్లు నిరాకరించారు. కొన్ని నెలల క్రితం ఓ పనిపై సదరు మహిళ తన పుట్టింటికి వెళ్లింది. 


ఆ సమయంలో ఇల్తాఫ్ ఆలం నుంచి ఆమెకు ఫోన్ వొచ్చింది. ఫోన్‌లో ఆమెకు అతడు ట్రిపుల్ తలాక్ చెప్పేశాడు. అయితే ఈ విషయాన్ని ఆమె సీరియస్‌గా తీసుకోలేదు. ఆటపట్టించేందుకు అలా మాట్లాడుతున్నాడేమో అని భావించింది. అయితే తాజాగా అత్తారింటికి వెళ్లిన ఆమెకు ఓ షాకింగ్ విషయం తెలిసింది. ఇల్తాఫ్ ఆలం సీరియస్‌గా తనకు ట్రిపుల్ తలాక్ చెప్పాడని.. మరో మహిళను కూడా పెళ్లి చేసుకున్నాడని గ్రహించి ఆగ్రహం వ్యక్తం చేసింది. తనకు న్యాయం చేయాలంటూ స్థానిక పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. 


Updated Date - 2022-05-19T21:38:31+05:30 IST