Advertisement

'పైసా పరమాత్మ' రిలీజ్ డేట్‌

Mar 7 2021 @ 13:58PM

కంటెంట్ ఉన్న చిత్రాలను ఆదరించడానికి తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు ముందుంటారు. అలా సరికొత్త కాన్సెప్ట్ తో రాబోతున్న చిత్రం 'పైసా పరమాత్మ' . సాంకేత్,సుధీర్, కృష్ణ తేజ్, జబర్దస్త్ అవినాష్, ర‌మ‌ణ‌, అనూష‌, అరోహి నాయుడు, బ‌నీష, జబర్దస్త్ దీవెన ప్రధాన పాత్రదారులు. ఈ చిత్రాన్ని ల‌క్ష్మీ సుచిత్ర క్రియేష‌న్స్ ప‌తాకంపై టి.కిర‌ణ్ కుమార్ నిర్మించారు. ఈ చిత్రానికి విజయ్ కిర‌ణ్ తిరుమల  దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఈ సినిమా మోష‌న్ పోస్ట‌ర్, ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌ రిలీజ్ కాగా ప్రేక్షకులనుంచి మంచి స్పందన వచ్చింది.  నిర్మాణానంత‌ర ప‌నులు  పూర్తి చేసుకుని మార్చి 12 న విడుదల సిద్ధంగా ఉంది.

 

ఈ సందర్భంగా నిర్మాత టి.కిర‌ణ్ కుమార్ మాట్లాడుతూ "పూర్తిగా స్టోరీ ని నమ్మి చేసిన చిత్రమిది. ఇప్పటితరానికి ఈ సినిమా నచ్చుతుంది. దర్శకుడు కథ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా సినిమా చేశాడు. అయన మీద నమ్మకంతోనే ఈ సినిమా పూర్తి చేయగలిగాం. ఈ సినిమా కి మొదటినుంచి సహాయ సహకారాలు అందించిన అందరికీ కృతజ్ఞతలు. ముఖ్యంగా సినిమా పోస్ట‌ర్ల‌ను ఆవిష్క‌రించి మమ్మల్ని ఆశీర్వదించిన రాజ్ కందుకూరిగారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు.. సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ చిత్రం  మార్చి 12 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అందరు సినిమాను ఆదరించండి" అని అన్నారు. 

Follow Us on:
Advertisement
 
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.