గాడిదలకు పైజామాలు!

ABN , First Publish Date - 2021-05-18T05:02:03+05:30 IST

అక్కడ గాడిదలకు పైజామాలు వేస్తారు. ఎందుకో తెలుసా? ఇంతకీ ఆ ప్రదేశం ఎక్కడుందో తెలుసా? ఆ విశేషాలు ఇవి...

గాడిదలకు పైజామాలు!

అక్కడ గాడిదలకు పైజామాలు వేస్తారు. ఎందుకో తెలుసా? ఇంతకీ ఆ ప్రదేశం ఎక్కడుందో తెలుసా? ఆ విశేషాలు ఇవి...

  • ఫ్రాన్స్‌లో రియా అనే ద్వీపం. ఈ ప్రాంతానికి పర్యాటకుల తాకిడి ఎక్కువ. ప్రకృతి సౌందర్యంతో పాటు ఇక్కడి గాడిదలను చూడటానికి పర్యాటకులు వస్తుంటారు.
  • వాటి ప్రత్యేకత ఏమిటంటే గాడిదలకు వాటి యజమానులు పైజామాలు వేస్తారు. ఈ గాడిదలను పొయిటో డాంకీస్‌ అంటారు. ఇవి ఎక్కువ ఎత్తుతో, బలిష్ఠంగా ఉంటాయి. 
  • వీటిని ఉప్పు నేలల్లో పనికి ఉపయోగిస్తారు. ఆ ప్రదేశాల్లో దోమలు, ఇతర కీటకాల తాకిడి ఎక్కువగా ఉంటుంది. వాటివల్ల గాడిదలు ఇబ్బంది పడటాన్ని గమనించిన యజమానులు వాటికోసం ప్రత్యేకంగా పైజామాలు తయారుచేయించి వేయడం మొదలుపెట్టారు.
  • ఈ సంప్రదాయం ఇప్పటికీ  కొనసాగుతోంది. పర్యాటకులను ఆకర్షించడం కోసమే పైజామాలు వేయడాన్ని కొనసాగిస్తున్నారు.

Updated Date - 2021-05-18T05:02:03+05:30 IST