ప్రధాని ఈవెంట్‌కు కవరేజీ ఇవ్వలేదని 17 సిబ్బందిని తొలగించిన పాక్ టీవీ

ABN , First Publish Date - 2022-05-01T21:37:17+05:30 IST

ఇస్లామాబాద్ : ప్రధాన మంత్రి కార్యక్రమానికి సరైన కవరేజీ ఇవ్వడంలో విఫలమైన 17 మంది అధికారులను సస్పెండ్ చేస్తూ పాకిస్తాన్ ప్రభుత్వ మీడియా PTV నిర్ణయం తీసుకుంది.

ప్రధాని ఈవెంట్‌కు కవరేజీ ఇవ్వలేదని 17 సిబ్బందిని తొలగించిన పాక్ టీవీ

ఇస్లామాబాద్ : ప్రధాన మంత్రి కార్యక్రమానికి సరైన కవరేజీ ఇవ్వడంలో విఫలమైన 17 మంది అధికారులను సస్పెండ్ చేస్తూ పాకిస్తాన్ ప్రభుత్వ మీడియా PTV నిర్ణయం తీసుకుంది. అధునాతన ల్యాప్‌టాప్ అందుబాటులో లేదనే కారణంగా పాక్ కొత్త Prime Minister Shehbaz Sharif లాహోర్ పర్యటనను పీటీవీలో సరైన రీతిలో చూపించలేదు. కొత్తగా ఎన్నికైన షాబాజ్ షరీఫ్ గతవారం కోట్ లఖ్‌పట్ జైలు, రంజాన్ బజార్లను సందర్శించారు. కానీ కార్యక్రమం వివరాలు పూర్తిస్థాయిలో పాకిస్తాన్ టెలివిజన్(పీటీవీ)లో ప్రసారం కాలేదు.  ఎఫ్‌టీపీ(ఫైల్ ట్రాన్ఫర్ ప్రొటోకాల్) ద్వారా వీడియో ఫుటేజీని అప్‌లోడ్ చేసేందుకు అధునాతన ల్యాప్‌టాప్ లేకపోవడమే ఇందుకు కారణమని డాన్ న్యూస్‌పేపర్ ఓ కథనాన్ని ప్రచురించింది.


స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ప్రకారం.. రిపోర్టర్లు, ప్రొడ్యూసర్లతో కూడిన వీవీఐపీ బృందం ప్రధాన మంత్రి కార్యక్రమాలను కవరేజీ చేయాల్సి ఉంది. ఈ బృందానికి అధునాతన ఎలక్ట్రానిక్ పరికరాలను అందిస్తారు. వీరు ప్రధాన మంత్రితోపాటే ప్రయాణించాల్సి ఉంటుంది. స్వదేశంతోపాటు విదేశాలకు వెళ్లినప్పుడు కూడా ప్రధాని వెంబడే ఉండాలి. కానీ అధునాతన ల్యాప్‌టాప్ లేకపోవడంతో ఈసారి కవరేజీ ఇవ్వలేదు. ఓ అధికారి తన వ్యక్తి ల్యాప్‌టాప్‌ నుంచి వీడియో ఫుటేజీ పంపేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. బ్యాటరీ అయిపోవడంతో ప్రయత్నం వృథా అయ్యింది. ప్రధాన మంత్రి కార్యక్రమానికి సరైన రీతిలో కవరేజీ దక్కలేదు. మరుసటి రోజే వీవీఐపీ కవరేజీ డిప్యూటీ కంట్రోలర్ ఇమ్రాన్ బసీర్ ఖాన్ సహా 17 మంది అధికారులను పీటీవీ సస్పెండ్ చేసింది. వీరితోపాటు నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇంజనీర్లు, కెమెరామ్యాన్లను కూడా తొలగించింది. 

Updated Date - 2022-05-01T21:37:17+05:30 IST