పాకిస్థాన్ క్లీన్‌స్వీప్
ABN , First Publish Date - 2021-05-11T09:20:30+05:30 IST
జింబాబ్వేతో రెండు టెస్టుల సిరీస్‌ను పాకిస్థాన్ 2-0తో క్లీన్‌స్వీ్‌ప చేసింది. నాలుగోరోజే ముగిసిన రెండో టెస్టులో పాక్ ఇన్నింగ్స్ 147 పరుగుల భారీ తేడాతో నెగ్గింది.
జింబాబ్వేపై 2-0తో టెస్టు సిరీస్ కైవసం
హరారే: జింబాబ్వేతో రెండు టెస్టుల సిరీస్‌ను పాకిస్థాన్ 2-0తో క్లీన్‌స్వీ్‌ప చేసింది. నాలుగోరోజే ముగిసిన రెండో టెస్టులో పాక్ ఇన్నింగ్స్ 147 పరుగుల భారీ తేడాతో నెగ్గింది. అలాగే పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ ఖాతాలో అరుదైన రికార్డు కూడా చేరింది. కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత వరుసగా నాలుగు టెస్టులు గెలిచిన తొలి పాక్ సారథిగా నిలిచాడు. ఇక జింబాబ్వే చివరి వికెట్‌ను తీసేందుకు ఆటకు నాలుగోరోజైన సోమవారం పాక్ 30 బంతులు మాత్రమే తీసుకుంది.
ఫాలోఆన్ ఆడిన జింబాబ్వే ఓవర్‌నైట్ స్కోరు 220/9తో రెండో ఇన్నింగ్స్ ఆరంభించి 231 పరుగులకు ఆలౌటైంది. షహీన్ అఫ్రీది, నౌమన్ అలీలకు ఐదేసి వికెట్లు దక్కాయి. అంతకుముందు పాక్ తొలిఇన్నింగ్స్ను 510/8 స్కోరుతో డిక్లేర్ చేయగా.. జింబాబ్వే తొలి ఇన్నింగ్స్‌లో 132 రన్స్‌కే కుప్పకూలింది.