ముస్లిం కూడా పూజలు నిర్వహించే ఆ హిందూ దేవాలయం.. ఎక్కడుందో మీకు తెలుసా?

ABN , First Publish Date - 2021-12-13T06:27:42+05:30 IST

ఒక హిందూ దేవలయంలో ముస్లింలు పూజలు నిర్వహిస్తున్నారు. అది కూడా ఒకరిద్దరు కాదు భారీ సంఖ్యలో వెళ్లి ఉత్సవాలు, పూజా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంతకీ ఆ దేవాలయం ఎక్కడుందో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఆ దేవాలయం ఉండేది ముస్లింలు మెజారిటీ జ‌నాభాగా ఉన్న పాకిస్తాన్‌లో.

ముస్లిం కూడా పూజలు నిర్వహించే ఆ హిందూ దేవాలయం.. ఎక్కడుందో మీకు తెలుసా?

ఒక హిందూ దేవలయంలో ముస్లింలు పూజలు నిర్వహిస్తున్నారు. అది కూడా ఒకరిద్దరు కాదు భారీ సంఖ్యలో వెళ్లి ఉత్సవాలు, పూజా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంతకీ ఆ దేవాలయం ఎక్కడుందో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఆ దేవాలయం ఉండేది ముస్లింలు మెజారిటీ జ‌నాభాగా ఉన్న పాకిస్తాన్‌లో.

పాకిస్తాన్‌లోని బ‌లూచిస్తాన్ ప్రావిన్స్‌లో హింగ్ లాజ్ మాతా మందిర్ అనే దేవాల‌యం ఉంది. బ‌లూచిస్తాన్ నుంచి 120 కిలోమీట‌ర్ల దూరంలో హింగ్లూ న‌ది తీరాన వెలసిన అమ్మ‌వారి దేవాల‌యం చాలా మ‌హ‌త్యం క‌ల‌ద‌ని స్థానికులు అంటున్నారు. ఈ దేవాల‌యం అమ్మ‌వారి శ‌క్తి పీఠాల‌లో ఒక‌ట‌ని వారు న‌మ్ముతున్నారు. అక్క‌డ ముస్లింలు ఈ దేవాల‌యాన్ని ఒక తీర్థ స్థ‌లంగా భావించి అక్క‌డ జ‌రిగే పూజ‌ల‌కు భారీ సంఖ్యలో వ‌స్తుంటారు. ఈ శ‌క్తి పీఠాన్ని వారు నానీ కా మందిర్ అని పిలుస్తుంటారు. పాకిస్తాన్‌లో ఈ ఆచారం త‌ర‌త‌రాలుగా వ‌స్తోంద‌ని అక్క‌డి ముస్లింలు చెబుతున్నారు.

పురాణాల ప్ర‌కారం శ్రీ మ‌హా విష్టువు త‌న సుద‌ర్శ‌న చ‌క్రంతో మాతా స‌తి శ‌రీరాన్ని 51 భాగాలు చేశార‌ని.. ఆ భాగాలు ప్ర‌పంచంలో ప‌లు ప్రేదేశాల‌లో ఉన్నాయి. హింగ్ లాజ్ ప్ర‌దేశంలో మాతా స‌తి చేయి ప‌డ‌డంతో ఈ ప్ర‌దేశంలో కూడా ఒక శ‌క్తి పీఠం ఏర్పాటైంద‌ని.. అదే హింగ లాజ్ దేవాల‌యంగా కొన్ని శ‌తాబ్దాలుగా ప్రాచుర్యం పొందింద‌ని వారి పూర్వీకులు చెప్పార‌ని స్థానికులు అంటున్నారు.

Updated Date - 2021-12-13T06:27:42+05:30 IST