Pakistan minister వ్యాఖ్యలపై నవ్వుతున్న నెటిజనం

ABN , First Publish Date - 2021-11-25T14:20:39+05:30 IST

పాకిస్థాన్ సమాచార, ప్రసారశాఖ మంత్రి ఫవాద్ చౌదరి వెల్లుల్లి అద్రాక్ వ్యాఖ్యలపై నెటిజనం మండిపడ్డారు....

Pakistan minister వ్యాఖ్యలపై నవ్వుతున్న నెటిజనం

లాహోర్ : పాకిస్థాన్ సమాచార, ప్రసారశాఖ మంత్రి ఫవాద్ చౌదరి వెల్లుల్లి అద్రాక్ వ్యాఖ్యలపై నెటిజనం మండిపడ్డారు. కొన్నిసార్లు అనుకోకుండా జరిగిన చిన్న పొరపాటు కూడా ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతోంది.రెండు పేర్ల మధ్య గందరగోళం చెందడం అసాధారణం కాదు. కాని బాధ్యతాయుతమైన పాక్ మంత్రి ఫవాద్ చౌదరి వెల్లుల్లి, అల్లం మధ్య వ్యత్యాసాన్ని అర్ధం చేసుకోలేక పోవడంపై నెటిజన్లు నవ్వుతున్నారు.ఉల్లిపాయలు, వెల్లుల్లి వంటి తినదగిన వస్తువుల ధరల గురించి మంత్రి ఫవాద్ చౌదరి ఒక సమావేశంలో మాట్లాడుతున్నారు. కానీ అతను వెల్లుల్లి యొక్క ఉర్దూ అనువాదాన్ని సరిగ్గా చేయలేకపోయాడు. వెల్లుల్లిని ‘అద్రాక్’ అంటూ గందరగోళ పరిచాడు. ఉర్దూలో వెల్లుల్లిని లెహ్సన్ అంటారు. 


కాని మంత్రి ఫవాద్ చౌదరి మాత్రం అద్రాక్ అంటూ అల్లం గురించి చెప్పాడు.వెల్లుల్లికి ఉర్దూ పదం తెలియని మంత్రిని ట్విట్టరులో నెటిజన్లు ఘాటుగానే విమర్శించారు.వెల్లుల్లి అద్రాక్ మంత్రి చౌదరి రోజుకో కొత్త విషయం నేర్చుకోవాలి అంటూ నైలా ఇనాయత్ అనే నెటిజన్ కామెంట్ చేశారు. మంత్రివర్యులు బాల్యంలో ఏ స్కూలులో చదువుకున్నారు? అని డాక్టర్ వినాయక్ దూబే ప్రశ్నించారు.‘‘వెల్లుల్లి అల్లం వ్యాఖ్యలతో మంత్రి ఫవాద్ చౌదరి తికమక పడ్డాడని, నేను ఉక్రెయిన్ నుండి ఎంబీబీఎస్, బీటెక్ డ్యూయల్ డిగ్రీని పొందాను, నేను పాకిస్థాన్‌లో మంత్రి పదవికి దరఖాస్తు చేయవచ్చా?’’ అని అనిల్ కృష్ణ చంద్ర ట్వీట్‌లో ప్రశ్నించారు.మొత్తం మీద పాక్ మంత్రి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.


Updated Date - 2021-11-25T14:20:39+05:30 IST