shocking: పెరిగిన ఆహార ధరలకు పరిష్కారం...తక్కువ తినండి...pak మంత్రి కామెంట్

ABN , First Publish Date - 2021-10-12T13:03:27+05:30 IST

పాకిస్థాన్ దేశ మంత్రి నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలపై షాకింగ్ కామెంట్ చేశారు...

shocking: పెరిగిన ఆహార ధరలకు పరిష్కారం...తక్కువ తినండి...pak మంత్రి కామెంట్

ఇస్లామాబాద్ (పాకిస్థాన్): పాకిస్థాన్ దేశ మంత్రి నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలపై షాకింగ్ కామెంట్ చేశారు. ధరల పెరుగుల నేపథ్యంలో ప్రజలు తక్కువ తినాలని కోరిన పాక్ మంత్రి వివాదానికి తెర లేపారు. చక్కెర, పిండి పదార్థాల ధరలు పెరుగుతున్నందు వల్ల ప్రజలు వీటిని తక్కువ తినాలని పాక్ దేశంలోని గిల్గిత్ బాల్టిస్తాన్ మంత్రి అలీ అమిన్ గందపూర్ కోరారు. ద్రవ్యోల్బణం గురించి బహిరంగ సభలో ప్రసంగించిన పాక్ మంత్రి ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.ద్రవ్యోల్బణం గురించి చెబుతూ ప్రజలు పిల్లలను బానిసత్వం నుంచి కాపాడటానికి త్యాగాలు చేయాలని మంత్రి కోరారు.


కాగా ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంలో నిత్యావసర వస్తువుల ధరల రెట్టింపు పెరిగాయని ఫఖ్తున్ జాతీయవాద పార్టీ సీనియర్ నాయకుడు గులాం అహ్మద్ బిలోర్ ఆరోపించారు. సాధారణ ఎన్నికల సమయంలో ఇమ్రాన్ ఖాన్ సర్కారు ఇచ్చిన వాగ్ధానాలను నెరవేర్చలేదని ఆరోపిస్తూ పాకిస్థాన్ అవామీ నేషనల్ పార్టీ నేతలు నిరాహార దీక్ష చేపట్టారు.


Updated Date - 2021-10-12T13:03:27+05:30 IST