భారత్‌పై ఇమ్రాన్ సంచలన వ్యాఖ్యలు..

ABN , First Publish Date - 2022-03-21T01:27:25+05:30 IST

ఇస్లామాబాద్: పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖైబర్ ఫఖ్తుంక్వాలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ భారత విదేశీ విధానాలపై ప్రశంసలు కురిపించారు.

భారత్‌పై ఇమ్రాన్ సంచలన వ్యాఖ్యలు..

ఇస్లామాబాద్: పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖైబర్ ఫఖ్తుంక్వాలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ భారత విదేశీ విధానాలపై ప్రశంసలు కురిపించారు. భారత విదేశాంగ విధానాలు భారత దేశానికి మంచి చేస్తున్నాయన్నారు. దేశ పౌరుల కోసం భారత్ ఎంతకైనా తెగిస్తుందని, ఏ ఒత్తిళ్లకూ లొంగకుండా భారత్ ఉంటుందన్నారు. రష్యా - ఉక్రెయిన్ యుద్ధ వేళ తటస్థ వైఖరి పాటిస్తూ అమెరికాతో సంబంధాలు కాపాడుకుంటూనే రష్యా నుంచి ముడిచమురు తక్కువ ధరకు కొనుగోలు చేశారని ఇమ్రాన్ ప్రశంసించారు. అదే సమయంలో ఇండియన్ ఆర్మీపై ఇమ్రాన్ ప్రశంసల వర్షం కురిపించారు. ప్రభుత్వంలో ఇండియన్ ఆర్మీ జోక్యం చేసుకోదన్నారు. పాక్ ఆర్మీకి డబ్బులిచ్చి తన ప్రభుత్వాన్ని కాపాడుకోలేనని చెప్పి కలకలం రేపారు.


కొద్ది రోజులుగా పాకిస్థాన్ ఆర్మీతో ఇమ్రాన్‌కు పొసగడం లేదు. ఆర్మీ చీఫ్ బాజ్వాను టార్గెట్ చేస్తూ బహిరంగ విమర్శలు చేస్తున్నారు. అలాగే పాక్ ప్రతిపక్షాలను కూడా ఇమ్రాన్ నిరంతరం విమర్శిస్తున్నారు. సంఖ్యా బలం లేకపోవడంతో ఇమ్రాన్‌‌పై అవిశ్వాస తీర్మానం పెట్టాలని ప్రతిపక్షాలు యోచిస్తున్నాయి. ఇమ్రాన్ సర్కారు ఏ క్షణంలోనైనా కూలిపోయే అవకాశముందని పాక్ రాజకీయ పరిశీలకులంటున్నారు. ఈ నెల 25న పాక్ నేషనల్ అసెంబ్లీ సమావేశం కానుంది. 

Updated Date - 2022-03-21T01:27:25+05:30 IST