పాక్‌కు సౌదీ అరేబియా భారీ ఆర్థిక ప్యాకేజీ

ABN , First Publish Date - 2022-05-01T23:51:10+05:30 IST

ఇస్లామాబాద్ : ఆర్థిక వ్యవస్థ పతనంతో కొట్టుమిట్టాడుతున్న Pakistan కు Saudi Arabia భారీ finacila package ప్రకటించింది.

పాక్‌కు సౌదీ అరేబియా భారీ ఆర్థిక ప్యాకేజీ

ఇస్లామాబాద్ : ఆర్థిక వ్యవస్థ పతనంతో కొట్టుమిట్టాడుతున్న Pakistan కు Saudi Arabia భారీ finacila package ప్రకటించింది. 8 బిలియన్ డాలర్ల ప్యాకేజీని అందించాలని సౌదీ నిర్ణయించింది. పాక్ కొత్త ప్రధాని Shehbaz Sharif తమ దేశ పర్యటనలో ఉండగా సౌదీ ఈ మేరకు అంగీకారం తెలిపింది. ఈ ప్యాకేజీతో పాకిస్తాన్‌లో ఆయిల్ ఫైనాన్సింగ్ ఫెసిలిటీని రెట్టింపు చేయనున్నారు. మిగతా నిధులను డిపాజిట్ల రూపంలో పాక్‌కు అందించనున్నారని ది న్యూస్ ఇంటర్నేషనల్ పేర్కొంది. అయితే ఈ ప్యాకేజీకి సంబంధించిన సాంకేతిక వివరాలు సిద్ధమవుతున్నాయి. డాక్యుమెంట్లను రూపొందించి.. సంతకాలు చేసేందుకు 2 వారాల సమయం పడుతుందని సౌదీకి చెందిన ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. వాస్తవానికి పాక్ ప్రధాని షాబాజ్, ఇతర అధికారుల సౌదీ పర్యటన ముగిసింది. వారంతా తిరిగి పాక్ చేరుకున్నారు. కానీ ఆ దేశ ఆర్థిక మంత్రి మిఫ్తా ఇస్మైల్ ఇంకా సౌదీలోనే ఉన్నారు. ఆర్థిక ప్యాకేజీని ఖరారు చేసుకునేందుకు ఆయన అక్కడ ఉన్నారు. అధికారులతో టెక్నికల్ స్థాయి చర్చల  కోసం తాను సౌదీలోనే ఉన్నానని ఇస్మైల్ ట్వీట్ చేశారు.  

Updated Date - 2022-05-01T23:51:10+05:30 IST