కశ్మీర్ సరిహద్దుల్లోని మూడు సెక్టార్లలో పాక్ కాల్పులు..

ABN , First Publish Date - 2020-09-23T18:00:55+05:30 IST

జమ్మూకశ్మీర్‌ సరిహద్దుల్లోని నియంత్రణరేఖ మూడు సెక్టార్లలో పాక్ సైనికులు బుధవారం ఉదయం 9 గంటలకు కాల్పులకు దిగారు....

కశ్మీర్ సరిహద్దుల్లోని మూడు సెక్టార్లలో పాక్ కాల్పులు..

తిప్పికొట్టిన భారత సైన్యం

శ్రీనగర్ (జమ్మూకశ్మీర్): జమ్మూకశ్మీర్‌ సరిహద్దుల్లోని నియంత్రణరేఖ మూడు సెక్టార్లలో పాక్ సైనికులు బుధవారం ఉదయం 9 గంటలకు కాల్పులకు దిగారు. జమ్మూకశ్మీరులోని ఫూంచ్ జిల్లాలో వరుసగా ఐదో రోజు సరిహద్దుల్లో పాక్ సైనికులు కాల్పులు జరిపారు.ఫూంచ్ జిల్లా షహపూర్, కిర్నీ, ఖస్బా సెక్టార్లలో పాక్ సైనికులు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి మోర్టార్లు, షెల్లింగులతో కాల్పులకు దిగారు. పాక్ సైనికుల కాల్పులను తిప్పికొట్టామని భారత సైనిక విభాగం అధికారప్రతినిధి కల్నల్ దేవేందర్ ఆనంద్ చెప్పారు. ఈ ఏడాది పాకిస్థాన్ 3186 సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. పాక్ జరిపిన కాల్పుల్లో 24 మంది పౌరులు మరణించగా మరో 100మంది గాయపడ్డారు.భారత సైనికుల ప్రతి కాల్పులతో పాక్ సైనికులు తోక ముడిచారు.

Updated Date - 2020-09-23T18:00:55+05:30 IST