
ఆమె పాకిస్థానీ మోడల్.. సోషల్ మీడియాలో ఆమెకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది.. తాజాగా ఆమె ట్విటర్‌లో షేర్ చేసిన 15 సెకెండ్ల టిక్‌టాక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.. అనంతరం నెటిజన్ల ఆగ్రహానికి గురై తీవ్రంగా ట్రోలింగ్‌కు గురవుతోంది.. ఆమెను ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని నెటిజన్లు కోరుతున్నారు.
ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే.. హుమైరా అస్ఘర్ అనే సోషల్ మీడియా సెలబ్రిటీ తెల్ల గౌను ధరించి సరదాగా నడుచుకుంటూ వస్తోంది. ఆమె వెనకాల ఓ అడవి తగలబడుతోంది. ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన హుమైరా.. `నేనెక్కడ ఉంటే అక్కడ మంటలు చెలరేగుతాయి` అని కామెంట్ చేసింది. చెట్లు తగలబడుతుంటే ఆమె సరదాగా నడుచుకుంటూ రావడాన్ని నెటిజన్లు తప్పు పడుతున్నారు.
ఆ వీడియో ట్రోలింగ్‌కు గురి కావడంతో హుమైరా వెంటనే దానిని తొలగించింది. ఆ మంటలకు తాను కారణం కాదని పేర్కొంది. ఆమె చాలా పిచ్చిగా, నిర్లక్ష్యంగా ప్రవర్తించిందని, ఆమె లాంటి వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ఆమెను అన్ ఫాలో చేస్తున్నట్టు చాలా మంది కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి