నోట్ల కట్టలు చూపించి చిక్కుల్లో పడ్డ టిక్‌టాక్ స్టార్

ABN , First Publish Date - 2022-01-15T03:09:17+05:30 IST

నెటిజన్ల అభిమానం తడిసి ముద్దవుతూ ఆకాశంలో తెలిపోతున్న పాకిస్థానీ టిక్‌టాక్ స్టార్ హరీమ్ షా.. ఊహించని విధంగా చిక్కుల్లో పడింది. ఓ వీడియోలో ఆమె తన వద్ద ఉన్న బ్రిటన్ నగదును చూపించడంతో పరిస్థితి ఒక్కసారిగా తల్లకిందులైపోయింది.

నోట్ల కట్టలు చూపించి చిక్కుల్లో పడ్డ టిక్‌టాక్ స్టార్

ఇంటర్నెట్ డెస్క్: నెటిజన్ల అభిమానంలో తడిసి ముద్దవుతూ ఆకాశంలో తెలిపోతున్న పాకిస్థానీ టిక్‌టాక్ స్టార్ హరీమ్ షా.. ఊహించని విధంగా చిక్కుల్లో పడింది. ఓ వీడియోలో ఆమె తన వద్ద ఉన్న బ్రిటన్ నగదును చూపించడంతో పరిస్థితి ఒక్కసారిగా తల్లకిందులైపోయింది. పెద్ద సంఖ్యలో నోట్ల కట్టలు ఆ వీడియోలో కనిపించడంతో అది కాస్తా తెగ వైరల్ అయింది. ఫలితంగా ప్రభుత్వం రంగంలోకి దిగి ఆమెపై నగదు అక్రమ రవాణా కేసుకు సంబంధించిన దర్యాప్తు ప్రారంభించింది. కాగా.. వీటిని తీసుకుని తాను పాకిస్థాన్‌ను నుంచి బ్రిటన్‌కు వెళ్లానని తన వీడియోలో హరీమ్ చెప్పడంతో ప్రభుత్వ దృష్టి ఆమెపై పడింది. కాగా.. పాక్ చట్టాల ప్రకారం.. విమాన ప్రయాణికులు పది వేల డాలర్లకు మించి నగదు తమ వెంట తీసుకెళ్లరాదు. 

Updated Date - 2022-01-15T03:09:17+05:30 IST