UAE: అదృష్టం అంటే ఇతడిదే.. వెయిటర్‌గా పని చేస్తూ 1కేజీ బంగారం గెలుచుకున్నాడు!

ABN , First Publish Date - 2022-09-09T15:55:09+05:30 IST

చిన్నతనం నుంచి తల్లిదండ్రుల కష్టాన్ని కళ్లారా చూశాడు. పెరిగి పెద్దయ్యాక వాళ్లకు ఆసరాగా ఉండాలని భావించాడు. ఈ క్రమంలోనే ఉపాధి వెతుక్కుంటూ దేశం కాని దేశానికి పయనమయ్యాడు. ఎడారి దేశంలో వెయిటర్‌గా ఉద్యోగం చేస్తూ.. నెల నెలా

UAE: అదృష్టం అంటే ఇతడిదే.. వెయిటర్‌గా పని చేస్తూ 1కేజీ బంగారం గెలుచుకున్నాడు!

ఎన్నారై డెస్క్: చిన్నతనం నుంచి తల్లిదండ్రుల కష్టాన్ని కళ్లారా చూశాడు. పెరిగి పెద్దయ్యాక వాళ్లకు ఆసరాగా ఉండాలని భావించాడు. ఈ క్రమంలోనే ఉపాధి వెతుక్కుంటూ దేశం కాని దేశానికి పయనమయ్యాడు. ఎడారి దేశంలో వెయిటర్‌గా ఉద్యోగం చేస్తూ.. నెల నెలా కొంత డబ్బును ఇంటికి పంపిస్తున్నాడు. ఈ క్రమంలోనే అతడిని తాజాగా అదృష్టం వరించింది. ఏకంగా కేజీ బంగారాన్ని గెలుచుకున్నాడు. దీంతో అతడి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. కాగా.. అతడికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెలితే..



పాకిస్థాన్‌(Pakistan)కు చెందిన సయీద్(Syed).. నాలుగేళ్ల క్రితం ఉపాధి కోసమని యూఏఈ వచ్చాడు. ఓ రెస్టారెంట్‌లో వెయిటర్‌(Pakistani waiter)గా ఉద్యోగం పొంది.. నెల నెలా కొంత డబ్బును అతడు తన కుటుంబ సభ్యులకు పంపుతూ తల్లిదండ్రులకు ఆసరాగా ఉంటున్నాడు. ఈ క్రమంలోనే అతడికి సుమారు ఆరు నెలల క్రితం Mahzooz draw గురించి తెలిసింది. దీంతో 6నెలలుగా అతడు వారం వారం జరిగే  Mahzooz drawలో పాల్గొంటూ వచ్చాడు. ఈ నేపథ్యంలో అతడిని అదృష్టం వరించింది. తాజాగా జరిగిన డ్రాలో అతడు ఏకంగా కేజీ బంగారాన్ని గెలుచుకున్నాడు. 


ఈ సందర్భంగా స్థానిక మీడియాతో మాట్లాడిన సయూద్.. సంతోషం వ్యక్తం చేశాడు. డ్రా ప్రత్యక్ష ప్రసారాన్ని టీవీలో వీక్షించినట్టు చెప్పిన ఆయన.. కేజీ బంగారాన్ని గెలుచుకున్నట్టు తెలియగానే.. తన తల్లిదండ్రులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చినట్టు చెప్పాడు. వాళ్లు కూడా ఆనందం వ్యక్తం చేసినట్టు పేర్కొన్నాడు. కేజీ బంగారాన్ని గెలిచినప్పటికీ.. ఎప్పటిలాగే వెయిటర్‌గా ఉద్యోగం చేయనున్నట్టు వెల్లడించాడు. 


Updated Date - 2022-09-09T15:55:09+05:30 IST