Pakistanలో పెట్రోల్ బంకు డీలర్ల సమ్మె

ABN , First Publish Date - 2021-11-25T12:56:25+05:30 IST

ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాకిస్థాన్ ప్రభుత్వం వైఖరికి నిరసనగా గురువారం పెట్రోలు బంకులను మూసివేశారు. ...

Pakistanలో పెట్రోల్ బంకు డీలర్ల సమ్మె

కరాచీ (పాకిస్థాన్): ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాకిస్థాన్ ప్రభుత్వం వైఖరికి నిరసనగా గురువారం పెట్రోలు బంకులను మూసివేశారు. తమ కమీషన్ పెంచనందుకు నిరసనగా పాకిస్థాన్ పెట్రోలియం డీలర్ల సంఘం సమ్మెకు దిగింది. గురువారం ఉదయం 6 గంటల నుంచి దేశంలోని అన్ని పెట్రోలు బంకులను మూసివేశామని, ఈ సమ్మె ఎప్పటికి ముగుస్తుందో మాత్రం తెలియదని పాక్ పెట్రోలు డీలర్ల సంఘం అధ్యక్షుడు అబ్దుల్ సమీఖాన్ చెప్పారు. పాక్ ప్రభుత్వం తమ కమీషన్ పెంచి మూడేళ్లు అయింది. పెరిగిన పెట్రోలు ధరలతో కమీషన్ పెంచక పోవడంతో పెట్రోలు బంకుల నిర్వహణ కష్టంగా మారిందని డీలర్లు అంటున్నారు.


నవంబరు 5వతేదీ నుంచి పెట్రోలు డీలర్లు సమ్మె చేయాలని నిర్ణయించినా ప్రభుత్వ ప్రతినిధి బృందం సమావేశంతో దీన్ని వాయిదా వేశారు.పెట్రోలు బంకుల బంద్ కు ఒక రోజు ముందు పెట్రోలు బంకుల వద్ద వాహనాలు బారులు తీరాయి. ఇస్లామాబాద్, రావల్పిండి, కరాచీ నగరాల్లో బుధవారం ట్రాఫిక్ స్తంభించింది. పెట్రోలు పంపు డీలర్ల సమ్మె నేపథ్యంలో పాకిస్థాన్ దేశంలో రోడ్లపై వాహనాలు కనిపించలేదు.


Updated Date - 2021-11-25T12:56:25+05:30 IST