పెరుగుతున్న అత్యాచారాల కేసులు...పాక్ పంజాబ్ ప్రావిన్సులో emergency

ABN , First Publish Date - 2022-06-21T16:56:31+05:30 IST

పాకిస్థాన్ దేశంలోని పంజాబ్ ప్రావిన్సులో అత్యాచారం కేసులు పెరుగుతుండటంతో ఆ రాష్ట్రంలో ఎమర్జెన్సీ...

పెరుగుతున్న అత్యాచారాల కేసులు...పాక్ పంజాబ్ ప్రావిన్సులో emergency

పంజాబ్: పాకిస్థాన్ దేశంలోని పంజాబ్ ప్రావిన్సులో అత్యాచారం కేసులు పెరుగుతుండటంతో ఆ రాష్ట్రంలో ఎమర్జెన్సీ (emergency) విధించాలని ఆ రాష్ట్రం సంచలన నిర్ణయం తీసుకుంది. మహిళలు పిల్లలపై లైంగిక వేధింపుల కేసులు పెరగడంతో పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో అధికారులు ఎమర్జెన్సీ ప్రకటించాలని నిర్ణయించారు.పంజాబ్ ప్రావిన్సులో అత్యాచార కేసులను ఎదుర్కోవటానికి పరిపాలన అత్యవసర పరిస్థితిని ప్రకటించవలసి వచ్చిందని పంజాబ్ హోం మంత్రి అట్టా తరార్ చెప్పారు. పంజాబ్ ప్రావిన్స్‌లో మహిళలు, పిల్లలపై లైంగిక వేధింపుల కేసులు వేగంగా పెరగడం సమాజానికి తీవ్రమైన సమస్య అని మంత్రి అన్నారు.‘‘పంజాబ్‌ రాష్ట్రంలో ప్రతిరోజూ నాలుగైదు అత్యాచార కేసులు నమోదవుతున్నాయి, దీంతో లైంగిక వేధింపులు, అత్యాచారం కేసులను పరిష్కరించడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది’’ అని ప్రావిన్షియల్ మంత్రి చెప్పారు. 


అన్ని కేసులను రేప్ అండ్ లా అండ్ ఆర్డర్ కేబినెట్ కమిటీ సమీక్షిస్తుందని మంత్రి చెప్పారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు భద్రత ప్రాముఖ్యత గురించి బోధించాలని, పర్యవేక్షణ లేకుండా యువతులు తమ ఇళ్లలో ఒంటరిగా ఉండకూడదని తరార్ కోరారు.పాఠశాలల్లో లైంగిక వేధింపుల గురించి విద్యార్థులను చైతన్యవంతులను చేస్తామని తరార్ పేర్కొన్నారు. ఈ కేసుల సత్వర విచారణ కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామని, డీఎన్‌ఏ నమూనాల కోసం పంజాబ్ ఫోరెన్సిక్ సైన్స్ ఏజెన్సీ పాత్రను మెరుగుపరుస్తామని మంత్రి చెప్పారు. ఉన్నత పాఠశాలలు, కళాశాలల్లో డ్రగ్స్ తీసుకోవడం ఒక ఫ్యాషన్‌గా మారిందని, ఇది క్రైమ్ గ్రాఫ్ పెరగడానికి దోహదపడుతుందని ఒక ప్రశ్నకు సమాధానంగా మంత్రి వివరించారు.


Updated Date - 2022-06-21T16:56:31+05:30 IST