పాలకాయలు

ABN , First Publish Date - 2020-06-10T05:30:00+05:30 IST

ఉప్పు, పంచదార, నూనె టేబుల్‌ స్పూన్‌ చొప్పున నీళ్లలో వేసి, బాగా మరగబెట్టాలి. అందులో బియ్యప్పిండిని పోస్తూ కలియబెట్టాలి. కొంచెం గట్టి పాకం కాగానే దించి పక్కనపెట్టాలి. వేడి చల్లారాక, అందులో వాము వేసి, పిసుకుతూ పిండిని మెత్తగా చేసుకోవాలి...

పాలకాయలు

కావలసినవి:

  1. బియ్యప్పిండి - 2 కప్పులు
  2. పంచదార - 2 టేబుల్‌ స్పూన్లు
  3. ఉప్పు - రుచికి సరిపడా
  4. నూనె - తగినంత
  5. వాము - టేబుల్‌ స్పూను
  6. నీళ్లు - 2 కప్పులు


తయారీ:

ఉప్పు, పంచదార, నూనె టేబుల్‌ స్పూన్‌ చొప్పున నీళ్లలో వేసి, బాగా మరగబెట్టాలి. అందులో బియ్యప్పిండిని పోస్తూ కలియబెట్టాలి. కొంచెం గట్టి పాకం కాగానే దించి పక్కనపెట్టాలి. వేడి చల్లారాక,  అందులో వాము వేసి, పిసుకుతూ పిండిని మెత్తగా చేసుకోవాలి. చిన్న ఉండలుగా చేసి పెట్టుకోవాలి. ఈ ఉండలను కీరదోస ఆకారంలో పొడవుగా సాగ దీసి ప్లేట్‌లో పెట్టాలి. కడాయిలో నూనె పోసి మరిగాక అందులో 10 చొప్పున పాలకాయలను వేసి గోధుమరంగులోకి మారేదాకా వేగించాలి. తరువాత బయటకు తీసి టిష్యూ పేపర్‌ మీద ఉంచితే నూనె అంటుకోదు.   చల్లారాక పాలకాయలను మూత ఉన్న డబ్బాలో నిల్వ చేసుకోవాలి.


Updated Date - 2020-06-10T05:30:00+05:30 IST