ఇండియన్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్సులోకి పలమనేరు బాలిక

ABN , First Publish Date - 2022-05-17T05:48:44+05:30 IST

పలమనేరు పట్టణానికి చెందిన మూడేళ్ల చిన్నారి వేద ఇవాంజిల్‌ ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డులో స్థానం పొందింది.

ఇండియన్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్సులోకి పలమనేరు బాలిక
ఇండియన్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్సులో స్థానం పొందిన వేద

పలమనేరు, మే 16: పట్టణానికి చెందిన మూడేళ్ల చిన్నారి వేద ఇవాంజిల్‌ ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డులో స్థానం పొందింది. విద్యానగర్‌ కాలనీకి చెందిన హిమబిందు, అమరనాథ్‌ కుమార్తె వేద ఇవాంజల్‌ (రెండు సంవత్సరాల పదకొండునెలలు) డ్రాయింగ్‌, పెయింటింగ్‌ అంటే ఆసక్తి. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో  ఆరునెలల నుంచి డ్రాయింగ్‌, పెయింటింగ్‌పై మరింత పట్టుసాధించింది.  వేద ప్రతిభను గుర్తించిన తల్లిదండ్రులు ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్సుకు దరఖాస్తు చేసుకోగా గత నెల 10 వతేది ఆన్‌లైన్‌ ద్వారా పరీక్ష నిర్వహించారు. ఇందులో జాతీయ పతాకాలు, జాతీయ పక్షులతో పాటు, వారు అడిగిన ప్రశ్నలన్నింటికీ చకచకా సమాధానం చెప్పింది. అలాగే చిరుధాన్యాలతో జాతీయపతాకం, ఇండియాబుక్‌ ఆఫ్‌ రికార్డు లోగోను ఇసుకతో తీర్చిదిద్దడం, పదిరకాల కూరగాయల పెయింటింగ్‌లను ప్రదర్శించింది. దీంతో ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్సు నిర్వాహకులు చిన్నారి ప్రతిభను గుర్తించి  రికార్డులో స్థానం కల్పించినట్టు ప్రకటిస్తూ పోస్టు ద్వారా సర్టిఫికెట్లు పంపారు. 

Updated Date - 2022-05-17T05:48:44+05:30 IST