పాలమూరు ప్రగతికి పట్టం

ABN , First Publish Date - 2022-01-26T06:12:38+05:30 IST

సీఎం కేసీఆర్‌కు పాలమూరు జిల్లాపై ఎక్కువ ప్రేమ ఉందని, అందుకే ఈ జిల్లాకు మూ డు మెడికల్‌ కళాశాలలు, నాలుగు నర్సిం గ్‌ కళాశాలలను మంజూరు చేశారని, భవిష్యత్‌లో పాలమూరు ఇంకా ప్రగతి సాధిస్తుందని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు.

పాలమూరు ప్రగతికి పట్టం
వనపర్తిలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి హరీశ్‌రావు

- మూడు మెడికల్‌, నాలుగు నర్సింగ్‌ కళాశాలలు మంజూరు

- ఎంసీహెచ్‌, ఎస్‌ఎన్‌సీయూ,  టీ డయాగ్నోస్టిక్‌, డయాలసిస్‌ సెంటర్ల ఏర్పాటు

- వనపర్తి జిల్లాలో  విద్యారంగం అభివృద్ధి

- వనపర్తి జిల్లా పర్యటనలో రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు

వనపర్తి(ఆంధ్రజ్యోతి), జనవరి 25: సీఎం కేసీఆర్‌కు పాలమూరు జిల్లాపై ఎక్కువ ప్రేమ ఉందని, అందుకే ఈ జిల్లాకు మూ డు మెడికల్‌ కళాశాలలు, నాలుగు నర్సిం గ్‌ కళాశాలలను మంజూరు చేశారని, భవిష్యత్‌లో పాలమూరు ఇంకా ప్రగతి సాధిస్తుందని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. వనపర్తి జిల్లా పర్యటనలో భాగంగా మంగళవారం వ్యవసాయ శాఖ మంత్రి  నిరంజన్‌రెడ్డితో కలి సి.. 180 పడకలతో నిర్మించిన ఎంసీహెచ్‌, ఎస్‌ఎన్‌సీయూలను ప్రారంభించిన ఆయన టీ డయా గ్నోస్టిక్‌ సెంటర్‌కు శంకుస్థాపన చేశారు. నూతనంగా నిర్మిత మవుతున్న నర్సింగ్‌ కళాశాల తో పాటు మెడికల్‌ కళాశాల కోసం కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు.

 ఈ సందర్భంగా ఎంసీహెచ్‌ వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఏడేళ్లలో తెలంగాణకు ఒక్క మెడికల్‌ కాలే జీ మంజూరు చేయకున్నా.. ఒకే ఏడాది ఏకంగా 8 మెడికల్‌ కళాశాలలను మం జూరు చేయడం, అందులో రెండు వనప ర్తి, నాగర్‌కర్నూలు జిల్లాలకు ఇవ్వడం చరిత్రాత్మకం అన్నారు. 70 ఏళ్లలో కాంగ్రె స్‌, టీడీపీ ప్రభుత్వాలు సాధించలేని విజయాలను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సాధిస్తోందని అన్నారు. రాష్ట్రం లో రూ. 407 కోట్లతో 23 ఎంసీహెచ్‌లు ఇప్పటి వర కు మంజూరు కాగా.. అందులో వనపర్తి ఎంసీహెచ్‌ కూడా ఉందన్నారు. ఎస్‌ఎన్‌సీయూ యూనిట్లు కూడా అన్ని జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేశామన్నా రు. గతంలో ఒక్కచోటా కూడా డయాలసిస్‌ కేంద్రా లు లేవని, ఇప్పుడు ఉమ్మడి పాలమూరులోని అయిదు జిల్లాల్లో డయాలసీస్‌ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. గతంలో ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య 30శాతం కంటే తక్కువగా ఉండేది, ఇప్పుడు 52శాతానికి పెరిగింద న్నారు.  మహబూబ్‌నగర్‌ మెడికల్‌ కళాశాలలో ఇప్పటికే పీజీ తరగతులు ప్రారంభం కాగా.. వనపర్తిలో త్వరలోనే తరగతులు ప్రారంభమతాయని అన్నారు. ఇప్పటికే మెడికల్‌ కళాశాల తరగతుల ప్రారంభానికి కావాల్సినట్లుగా 300 బెడ్లకు గాను 330 బెడ్లను ఏర్పా టు చేశామని,  ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్లు, డాక్టర్లు, స్టాఫ్‌ నర్సులు, వివిధ విభాగాల అధిపతుల పోస్టింగు కూడా పూర్తి చేశామని అన్నారు. నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌ నిబంధనలకు అనుగుణంగా ఇబ్బందులు లేకుం డా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఉమ్మ డి జిల్లాలో ఒక్కో మెడికల్‌ కాలేజీకి రూ. 500 కోట్ల చొప్పున రూ. 1500 కోట్లు, ఒక్కో నర్సింగ్‌ కాలేజీకి రూ. 50కోట్ల చొప్పున రూ. 200 కోట్లు, టీ డయాగ్నోస్టిక్‌ సెంటర్ల కోసం సుమారు రూ. 8కోట్ల వరకు ఖర్చు చేస్తు న్నామని అన్నారు. 15 నుంచి 17 ఏళ్ల పిల్లలకు వ్యాక్సినేషన్‌ విషయంలో వనపర్తి అగ్రభాగాన నిలిచిందని అన్నారు. వనపర్తిలో ఇప్పుటి నుంచి ఉస్మానియా, గాం ధీ ఆస్పత్రుల్లో లభించిన వైద్యసేవలు అందుతా యని తెలిపారు. వనపర్తిలో ఆరు రోడ్లు నాలు గు లైన్లుగా విస్తరించే పనులు నడుస్తున్నా యని, అది చాలా కష్టమైన పని అని అన్నారు. తనకు సిద్దిపేటలోని ఒక్క సుభాష్‌రోడ్డును విస్తరించడం కోసమే సంవత్సర న్నర సమ యం పట్టిందని తెలిపారు. సీఎం ఆశీస్సులు, తన సహకారం జిల్లా అభివృద్ధికి ఉంటా యని అన్నారు. 

 

Updated Date - 2022-01-26T06:12:38+05:30 IST