పాలారు ఉధృతికి కొట్టుకుపోయిన వంతెన

ABN , First Publish Date - 2022-05-20T15:13:04+05:30 IST

పాలారు నదిలో వరద ఉధృతి కారణంగా ఆంబూరు సమీపంలో వంతెన కొట్టుకుపోవడంతో 20 గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. తిరుపత్తూర్‌ జిల్లా ఆంబూరు,

పాలారు ఉధృతికి కొట్టుకుపోయిన వంతెన

పెరంబూర్‌(చెన్నై): పాలారు నదిలో వరద ఉధృతి కారణంగా ఆంబూరు సమీపంలో వంతెన కొట్టుకుపోవడంతో 20 గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. తిరుపత్తూర్‌ జిల్లా ఆంబూరు, చుట్టుపక్కల ప్రాంతాల్లో గత ఏడాది నైరుతి రుతుపవన వర్షాల సమయంలో మాదనూరు పాలారు నదిలో వరదలు ఏర్పడి నదిపై ఏర్పాటుచేసిన నేల వంతెన కొట్టుకుపోయింది. వరద ఉధృతి తగ్గిన అనంతరం తాత్కాలికంగా వంతెన ఏర్పాటుచేశారు. ఈ నేపథ్యంలో, వారం రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా మాధనూరు పాలారు నదిలో ఏర్పడిన వరద ఉధృతి కారణంగా తాత్కాలిక వంతెన గురువారం ఉదయం కొట్టుకుపోయింది. ఈ ప్రాంతాన్ని కలెక్టర్‌ అమర్‌కు్‌షవాహ్‌ పరిశీలించారు.

Updated Date - 2022-05-20T15:13:04+05:30 IST