A rare bird: పళవేర్కాడులో అరుదైన పక్షి

ABN , First Publish Date - 2022-07-26T16:30:14+05:30 IST

అంతరించిపోతున్న పక్షి జాతుల్లో ఒకటైన ‘ఇండియన్‌ స్కిమ్మర్‌’ తిరువళ్లూర్‌ జిల్లా పళవేర్కాడులో కనిపించింది. పళవేర్కాడు జలాశయం తమిళనాడు-ఆంధ్ర

A rare bird: పళవేర్కాడులో అరుదైన పక్షి

ఐసిఎఫ్‌(చెన్నై), జూలై 25: అంతరించిపోతున్న పక్షి జాతుల్లో ఒకటైన ‘ఇండియన్‌ స్కిమ్మర్‌’ తిరువళ్లూర్‌ జిల్లా పళవేర్కాడులో కనిపించింది. పళవేర్కాడు జలాశయం తమిళనాడు-ఆంధ్ర(Tamilnadu-Andhra) రాష్ట్రాల సరిహద్దుల్లో వ్యాపించి ఉంది. సముద్రాన్ని ఆనుకొని ఉండడంతో అధికసంఖ్యలో విదేశీ పక్షులు ఇక్కడికి వస్తుంటాయి. పర్యాటక స్థలమైన ఈ ప్రాంతంలో వలస పక్షులు సీజన్‌ ప్రారంభం కావడానికి కొన్ని నెలలున్న నేపథ్యంలో, కొన్ని అరుదైన పక్షులు ఇక్కడకొచ్చాయి. వాటిలో అంతరించిపోతున్న జాతికి చెందిన ఇండియన్‌(Indian) స్కిమ్మర్‌ అనే పక్షి కనిపించడంతో పక్షుల ప్రేమికులు ఆశ్చర్యంతో వచ్చి చూసి వెళుతున్నారు. 2018లో కనిపించిన ఈ పక్షి మళ్లీ ఇక్కడకు వచ్చిందని, అంతరించిపోతున్న ఈ పక్షి జాతిని రక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పక్షుల ప్రేమికులు పేర్కొంటున్నారు.

Updated Date - 2022-07-26T16:30:14+05:30 IST