తహసీల్దార్ నటరాజ్‌తో మాట్లాడుతున్న మాజీ మంత్రి పల్లె
బుక్కపట్నం, మే 23: ప్రజాసమస్యలపై మాజీ మంత్రిపల్లె రఘునాథరెడ్డి తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం తహసీల్దార్‌తో భేటీ అయ్యారు. తహసీ ల్దార్ కార్యాలయంలో జరిగిన స్పందన కార్యక్రమానికి హాజరైన పల్లె మండల వ్యాప్తంగా నెలకొన్న ప్రజాసమస్యలను పరిష్కరించేందుకు చర్యలుతీసుకోవాలని తహసీల్దార్ నటరాజ్‌కు సూచించారు. అనంతరం స్థానిక టీడీపీ వర్గీయుల పలు వురి కుటుంబీకులను పరామర్శించి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ సంద ర్భంగా బుక్కపట్నం ఎస్సీకాలనీలో పర్యటించి వారి సమస్యలను అడిగితెలుసుకు న్నారు. బుక్కపట్నం మీదుగా పుట్టపర్తి, పెనుకొండకు టౌన సర్వీసులను నడపా లని, అలాగే ఆర్టీసీ సౌకర్యాలు మెరుగుపడేలా చర్యలుతీసుకోవాలన్నారు. ఈ కార్య క్రమంలో టీడీపీ మండల కన్వీనర్ చింతా మలిరెడ్డి, సీనియర్ నాయకులు పెద్ద రాశి సుబ్రహ్మణ్యం, జిల్లా ప్రధానకార్యదర్శి సామకోటి ఆదినారాయణ, రైతుసంఘం ఉపాధ్యక్షుడు మీసాల మురళి, తెలుగు మహిళ అధ్యక్షురాలు లావణ్యగౌడ్, నాయకులు వెంకటరాముడు, సయ్యద్‌బాషా, బాలు, సామకోటి ఈశ్వరయ్య, తెలుగుయువతనాయకులు జనార్దన, మోహన, సుధీర్, జేసీబీ చంద్ర పాల్గొన్నారు.