పాన్ కార్డ్ మీ మొత్తం జాతకాన్ని బయటపెడుతుంది.. ఒక్కసారి ఇలా చెక్ చేసుకోండి.. ఆశ్చర్యపోతారు!

ABN , First Publish Date - 2021-12-19T15:50:14+05:30 IST

ఐడి ప్రూఫ్‌గా ఆధార్ కార్డ్ ఎలా ఉందో..

పాన్ కార్డ్ మీ మొత్తం జాతకాన్ని బయటపెడుతుంది.. ఒక్కసారి ఇలా చెక్ చేసుకోండి.. ఆశ్చర్యపోతారు!

ఐడి ప్రూఫ్‌గా ఆధార్ కార్డ్ ఎలా ఉందో, వ్యక్తి ఆర్థిక స్థితిగతులకు గుర్తింపుగా పాన్ కార్డ్ ఉపయోగపడుతుంది. ఈ కార్డు ఆధారంగా వ్యక్తి ఎంత సంపాదిస్తున్నదీ తెలుసుకోవచ్చు. పన్నులు చెల్లించడానికి పాన్ కార్డును తప్పనిసరి చేశారు. ఇంతేకాకుండా బ్యాంక్, జాబ్ ఫీల్డ్, బిజినెస్, పోస్టాఫీస్ తదితర చోట్ల కూడా పాన్ కార్డ్ అడుగుతుంటారు. పాన్ కార్టుకు సంబంధించిన కొన్ని విషయాలు చాలామందికి తెలియదు. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.



పాన్ కార్డ్‌పై నమోదైన 10 అంకెల సంఖ్యను ఎప్పటికీ మార్చలేం. ఇది ఒక రకమైన ప్రత్యేక సంఖ్య. ఇది సంబంధిత వ్యక్తికి చెందిన పూర్తి వివరాలను తెలియజేస్తుంది. ఆదాయపు పన్ను శాఖ సంబంధింత పాన్ కార్డ్ నంబర్‌లో మొదటి 3 అక్షరాలు ఇస్తుంది. ఇది AAA నుండి ZZZ వరకు ఏ అక్షరాలైనా కావచ్చు. ఈ కార్డ్‌లోని నాల్గవ అక్షరం కూడా ఆల్ఫాబెటిక్‌గా ఉంటుంది. దీని ద్వారా కార్డ్ హోల్డర్ స్థితి తెలుస్తుంది. అయితే కార్డులోని 5వ అక్షరం కార్డుదారుని ఇంటిపేరులోని మొదటి అక్షరం. దీని తర్వాతగల సంఖ్యలో 4 అంకెలు ఉంటాయి. ఇది 0001 నుండి 9999 వరకు ఏదైనా సంఖ్య కావచ్చు. ఈ నంబర్‌ను ఆదాయపు పన్నుశాఖ నిర్ణయిస్తుంది. అయితే 10వ అక్షరం ఆంగ్ల వర్ణమాలలోని ఏదైనా అక్షరం కావచ్చు. పాన్ కార్డులో నాలుగో అక్షరం P అని ఉంటే వ్యక్తులది, C అని ఉంటే కంపెనీది అని అర్థం. 

Updated Date - 2021-12-19T15:50:14+05:30 IST