సోమేశ్వరస్వామికి విశేష అలంకారం

ABN , First Publish Date - 2020-12-04T04:42:01+05:30 IST

కార్తీక మాసం ఆరుద్ర నక్షత్రం పురస్కరించుకుని పంచారామ క్షేత్రం గునుపూడి సోమేశ్వరస్వామికి లక్షపత్రి పూజ, విశేష అలంకారం చేశారు.

సోమేశ్వరస్వామికి విశేష అలంకారం

భీమవరం టౌన్‌, డిసెంబరు 3: కార్తీక మాసం ఆరుద్ర నక్షత్రం పురస్కరించుకుని పంచారామ క్షేత్రం గునుపూడి సోమేశ్వరస్వామికి లక్షపత్రి పూజ, విశేష అలంకారం చేశారు. ఆలయ అర్చ కులు కందుకూరి సోంబాబు, చెరుకూరి రామ కృష్ణ ఆధ్వర్యంలో స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు చేశారు. సాయంత్రం మారేడు బిల్వ లతో పూజ నిర్వహించి పూలతో అలంకరించారు. ఆలయ ఇవోఅరుణ్‌కుమార్‌ పర్యవేక్షించారు.

Updated Date - 2020-12-04T04:42:01+05:30 IST