సమరభేరి

ABN , First Publish Date - 2021-01-22T05:44:30+05:30 IST

పంచాయతీ ఎన్నికల సమరభేరి మోగింది. ఎన్నికల నిర్వహణకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. కరోనాకు ముందు వాయిదా పడిన ఈ ఎన్నికలకు న్యాయపరమైన వివాదాలు వెంటాడుతుండగా.. ఎన్నో ఆటంకాలు, మరెన్నో ఎత్తుగడలు.. ఇంకెన్నో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

సమరభేరి

పంచాయతీ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌

పోలింగ్‌ తేదీలు.. ఫిబ్రవరి 5,9,13,17 

ఉదయం6.30 నుంచి 3.30 వరకు పోలింగ్‌.. వెంటనే ఫలితాలు, ఉప సర్పంచ్‌ ఎన్నిక

జిల్లాలో 190 మేజర్‌, 705  మైనర్‌ పంచాయతీలు

24 లక్షల 17 వేల 567 మంది ఓటర్లు 

బరిలో నిలిచేందుకు రెడీ అవుతున్న అభ్యర్థులు 

ఎన్నికలకు.. టీడీపీ సహా పలు పార్టీలు సంసిద్ధం

వాయిదాకు సుప్రీంను ఆశ్రయించిన అధికార పక్షం

పంచాయతీ ఎన్నికల సమరభేరి మోగింది. ఎన్నికల నిర్వహణకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. కరోనాకు ముందు వాయిదా పడిన ఈ ఎన్నికలకు న్యాయపరమైన వివాదాలు వెంటాడుతుండగా.. ఎన్నో ఆటంకాలు, మరెన్నో ఎత్తుగడలు.. ఇంకెన్నో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అంతిమంగా ఎన్నికల నిర్వహణపై ఒకవైపు ఎన్నికల కమిషన్‌, మరోవైపు ప్రభుత్వం ఢీకొంటున్న సందర్భంలో ఉద్యోగ సంఘాలు ఎన్నికల నిర్వహణను వ్యతిరేకించాయి. కరోనా వ్యాక్సిన్‌ ప్రక్రియకు ఇది ఆటంకమే అని పేర్కొన్నాయి. పంచాయతీ ఎన్నికలకు వీలుగా గురువారం హైకోర్టు జారీచేసిన అనుకూల తీర్పుతో ఎన్నికల తంతు మరోసారి ముందుకు వచ్చింది. జిల్లాలోని 895 పంచాయతీల్లో తెరలేసింది. 

– (ఏలూరు–ఆంధ్రజ్యోతి)

ఎన్నో మలుపులు, మరెన్నో వివాదాలు 

ఇంతకుముందున్న 909 పంచాయతీల్లో అప్పటి పరిస్థితు ల ప్రకారం ఓటర్ల సంఖ్య 25 లక్షల 50 వేల 916. భీమవరం మునిసిపాల్టీలో విలీనమయ్యే గ్రామాలు, చింతలపూడి మేజర్‌ గ్రామ పంచాయతీని నగర పంచాయతీగా అప్‌గ్రేడ్‌ చేసిన నేపథ్యంలో ఓటర్ల సంఖ్య 24 లక్షల 17 వేల 567గా నిర్ధా రించారు. సాధారణ ఎన్నికల్లో ప్రధాన పార్టీల మధ్య నువ్వా నేనా అన్నట్లు 190 మేజర్‌ పంచాయతీల్లో పోటీ జరిగింది. కొన్నిచోట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గెలుపోటములను ప్రభావితం చేశాయి. ఆయా పంచాయతీల్లో నమోదైన భారీ ఓటర్ల సంఖ్యే దీనికి కారణం. స్థానిక ఎన్నికల్లో మహిళలకు 50 శాతం సీట్లు రిజర్వ్‌ చేశారు. ఈ లెక్కన మహిళలకు వార్డుల్లోనూ సర్పంచ్‌ పదవుల్లోనూ 50 శాతం వర్తిస్తుంది. ప్రత్యేకించి ఎస్సీలకంటే ఎస్టీ రిజర్వుడ్‌ సర్పంచ్‌ పదవులు అత్యధికంగా ఉన్నాయి. బీసీలు అదేస్థాయిలో ఉన్నారు. 705 మైనర్‌ పంచాయతీల్లోనూ సామాజిక వర్గాల వారీగా ఓటర్లు చీలిపోయారు. గత ఏడాదిన్నరగా రాజకీయాల్లో కొత్త పరిణా మాలు చోటు చేసుకున్నాయి. మధ్యలో తొమ్మిది నెలలపాటు కరోనా కబళించి మొత్తం వ్యవస్థ రూపురేఖలనే మార్చేసింది. గత ఏడాది మార్చిలో స్థానిక సంస్ధల ఎన్నికలకు వీలుగా వరుస నోటిఫికేషన్లు జారీచేశాయి. కరోనా తీవ్రతను ముందు గానే గుర్తించి అప్పట్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను వాయిదా వేశారు. దీంతో రాజకీయ వివాదం ఆరంభమైంది. ఈలోపే భీమవరం మున్సిపాల్టీ పరిధిలో నాలుగు గ్రామ పంచాయతీలను విలీనం చేస్తూ నోటిఫై చేశారు. కొవ్వాడ, అన్నవరం, చినఅమిరం, రాయలం, తాడేరు వంటి పం చాయతీలకు ఈసారి ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదు. మేజర్‌ పంచాయతీ చింతలపూడిని ఇటీవల నగర పంచాయ తీగా అప్‌గ్రేడ్‌ చేశారు. ఈ దరిమిలా అక్కడా ఎన్నికలు జరిగే అవకాశాలు లేవు. ఇప్పటికే ఆకివీడు నగర పంచాయతీగా నోటిఫై అయింది కాబట్టి పంచాయతీ ఎన్నికల పరిధిలోకి అది రాదు. ప్రస్తుత పరిస్థితుల్లో మిగతా గ్రామ పంచాయ తీల్లో నువ్వా నేనా అనే విధంగా ఎన్నికల సమరం జరగబో తోంది. ఈ మధ్య చోటు చేసుకున్న పరిణామాలన్ని రాజకీయ పక్షాలపైనా తీవ్రంగా ప్రభావితం చేశాయి. తగ్గట్టుగానే ఫలి తాలు ఉండబోతున్నాయి. వైసీపీ దూకుడు ముందు ఒకదశ లో టీడీపీతో పాటు మిగతా పార్టీలు బెంబేలెత్తిపోయాయి. ఇంతకుముందు జరిగిన ఎన్నికల సమరంలో ఏకంగా ఏకగ్రీ వాల హవా నడిచింది. వీటిలో అత్యధికం వైసీపీనే కైవసం చేసుకుంది. అప్పట్లో ఎన్నికలు జరిపేందుకు మిగతా వాటితో పాటు పంచాయతీలను సిద్ధం చేస్తుండగానే ఎన్నికలు వాయి దాపడ్డాయి. ఇప్పుడు మళ్లీ పంచాయతీ పోరుకు తెరలేచింది. 


ఇప్పటికీ ఉత్కంఠే

ఓ వైపు గ్రామ పంచాయతీ ఎన్నికల పోరుకు హైకోర్టు సంసిద్దత వ్యక్తం చేసినా మరోవైపు దీనిని వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకు ఎక్కింది. తదనుగుణంగానే పంచాయతీ పోరుపై తీవ్ర ఉత్కంఠత కొనసాగుతోంది. వివిధ రాజకీయ పక్షాలు నువ్వా నేనా అన్నట్లు తలపడాల్సిన తరుణంలో వీటికి భిన్నంగా స్థానిక ఎన్నికలు వద్దంటూ రాష్ట్ర ప్రభుత్వం కాదూ కూడదంటూ మిగతా పక్షాలు ఎన్నికల యుద్ధం చేస్తు న్నాయి. ఈ యుద్ధంలో ఎవరిది పైచేయి కాబోతుందన్న విష యంలో ఇప్పటికీ ఎడతెగని ఉత్కంఠ నెలకొంది. తెలుగుదేశం నిర్విరామంగా వైసీపీ ఎదురొడ్డి పోరాడుతుండగా అదేబాట లో వామపక్షాలు, జనసేన సైఅంటున్నాయి. అధికార పార్టీ మాత్రం ఓ వైపు స్థానిక సమరానికి సిద్ధంగా లేమం టూనే మరోవైపు పంచాయతీస్థాయిలో అభ్యర్థుల ఎంపికను పూర్తి చేసింది. న్యాయస్థానాలు ఎన్నికలు జరపాల్సిందేనంటున్న తరుణంలో దీనికి తగ్గట్టుగానే ఎన్నికల బరిలో నిలిచేందుకు సంసిద్దులవుతున్నారు. తెలుగుదేశం, బీజేపీ, జనసేన, వామ పక్షాల అనుకూలురు ఎవరంతటికి వారుగానే అభ్యర్థులను రంగంలోకి దింపుతారా లేక స్థానిక ఐక్యత ప్రదర్శిస్తారా అనే ది ఇప్పుడు అందరినీ వెంటాడుతున్న ప్రశ్న. 

రిజర్వేషన్ల వారీగా..

సర్పంచ్‌లు  మహిళ జనరల్‌ మొత్తం

ఎస్సీ 37 33 70

ఎస్టీ 108 87 195

బీసీ 110 96 206

జనరల్‌ 208 221 429

మొత్తం 463 437 900

వార్డులు మహిళ  జనరల్‌ మొత్తం

ఎస్సీ 273 216 489

ఎస్టీ 1279 899 2178

బీసీ 1100 1020 2120

జనరల్‌ 2224 2741 4965

మొత్తం 4876 4876 9752


Updated Date - 2021-01-22T05:44:30+05:30 IST