ఓ కుటుంబానికి సొంత వాళ్ల నుంచే వింత కష్టం.. ఆవు మూత్రాన్ని తాగి.. చెప్పులను తలపై పెట్టుకుని క్షమాపణ కోరండంటూ..

ABN , First Publish Date - 2021-11-17T18:06:37+05:30 IST

గ్రామంలో నివసిస్తున్న ఓ కుటంబంపై సొంత వాళ్లే పగబట్టారు.. వారిని సమాజం నుంచి వెలి వేశారు.

ఓ కుటుంబానికి సొంత వాళ్ల నుంచే వింత కష్టం.. ఆవు మూత్రాన్ని తాగి.. చెప్పులను తలపై పెట్టుకుని క్షమాపణ కోరండంటూ..

గ్రామంలో నివసిస్తున్న ఓ కుటంబంపై సొంత వాళ్లే పగబట్టారు.. వారిని సమాజం నుంచి వెలి వేశారు.. ఎవరింట్లో శుభకార్యం జరిగినా వారిని పిలవకూడదని తీర్మానించారు.. ఆ నిషేదం ఎత్తి వేయాలంటే ఆవు మూత్రం తాగాలని, గెడ్డాలు, మీసాలు తీసుకుని, చెప్పులను తలపై పెట్టుకుని క్షమాపణ కోరాలని షరతు విధించారు.. దీంతో సదరు కుటుంబం కలెక్టర్‌ను ఆశ్రయించింది.. స్పందించిన కలెక్టర్ విచారణకు ఆదేశించారు.. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు సమీపంలో గుణ పంచాయితీలో ఈ ఘటన జరిగింది. 


గుణకు చెందిన హీరాలాల్ అనే వ్యక్తికి గ్రామానికి సమీపంలో వ్యవసాయ భూమి ఉంది. అక్కడ ఓ దేవాలయం నిర్మించుకోవాలని అతడి కులానికి చెందిన వారు తీర్మానించారు. దాంతో హీరాలాల్ 3600 చదరపు అడుగుల విస్తీర్ణం గల భూమిని ఉచితంగా ఇచ్చాడు. అయితే అది సరిపోదని మొత్తం భూమి కావాలని కుల పెద్దలు అడిగారు. అందుకు హీరాలాల్ అంగీకరించలేదు. దీంతో కుల పెద్దలు అతడిని బహిష్కరించారు. అతడి కుటుంబాన్ని కులం నుంచి వెలి వేశారు. 


సాటి కులస్థులు, బంధువులే తమను వెలివేయడంతో హీరాలాల్ కుటుంబం తల్లిడిల్లిపోయింది. తమను తిరిగి కలుపుకోమని ప్రాధేయపడింది. నిషేధం ఎత్తేయ్యాలంటే శిక్ష అనుభవించాల్సిందేనని కుల పెద్దలు తీర్మానించారు. ఆవు మూత్రం తాగాలని, గెడ్డాలు, మీసాలు తీసుకుని, చెప్పులను తలపై పెట్టుకుని కులస్థులందరినీ క్షమాపణ కోరాలని షరతు విధించారు. దీంతో హీరాలాల్ కుటుంబం కలెక్టర్‌ను ఆశ్రయించింది. స్పందించిన కలెక్టర్ విచారణకు ఆదేశించారు. విచారణ అనంతరం తగు చర్యలు తీసుకుంటామని హీరాలాల్‌కు హామీ ఇచ్చారు. 

Updated Date - 2021-11-17T18:06:37+05:30 IST