పంచాయతీల అభివృద్ధికి భారీగా నిధులు: ఎమ్మెల్యే రాములునాయక్‌

ABN , First Publish Date - 2021-05-11T04:48:31+05:30 IST

ప్రభుత్వం గ్రామపంచాయతీల అభివృద్ధి కోసం భారీగా నిధులు మంజూరు చేస్తుందని దీంతో పల్లెగ్రామాల రూపురేఖలు మారపోతాయని వైరా ఎమ్మెల్యే రాములునాయక్‌ అన్నారు.

పంచాయతీల అభివృద్ధికి భారీగా నిధులు: ఎమ్మెల్యే రాములునాయక్‌
కారేపల్లిలో షాధిముభారక్‌ చెక్కులు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే

కారేపల్లి/ కొణిజర్ల మే 10: ప్రభుత్వం గ్రామపంచాయతీల అభివృద్ధి కోసం భారీగా నిధులు మంజూరు చేస్తుందని దీంతో పల్లెగ్రామాల రూపురేఖలు మారపోతాయని వైరా ఎమ్మెల్యే  రాములునాయక్‌ అన్నారు. సోమవారం తహసీల్దార్‌ కార్యాలయంలో 17మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మీ, షాధిముభారక్‌ చెక్కులు పంపిణీ చేశారు. తహసీల్దార్‌ పుల్లయ్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ కరోనాలో కూడ ప్రభుత్వం అన్ని సంక్షేమా పథకాలు సాగిస్తుందన్నారు. ఈకార్యక్రమంలో ఎంపీపీ శకుంతల, మండలపార్టీ కన్వీనర్‌ మల్లెల నాగేశ్వరావు, ఆత్మకమిటి ఛైర్మన్‌ ముత్యాలసత్యానారాయణ,సోషైటి చైర్మన్‌ దుగ్గినేని శ్రీనివాసరావు, వైస్‌ చైర్మన్‌ దారవత్‌ మంగీలాల్‌, అజ్మీర వీరన్న, వైస్‌ ఎంపీపీ రావూరి శ్రీనివా్‌సరావు, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు రమేష్‌ సర్పంచ్‌ స్రవంతి, ఎంపీటీసీ సభ్యులు రమాదేవి, వసంత, పలువురు సర్పచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే సమక్షంలో ఉపసర్పచ్‌ దంపతులు చేరిక

మండలం పరిధిలోని గుంపెళ్లగూడెం గ్రామపంచాయతీకి చెందిన ఉపసర్పంచ్‌ ఎర్రబెల్లి దుర్గ, శ్రీను దంపతులతో పాటు పలు కుటుంబాలకు చెందిన వివిధ పార్టీలకు చెందిన వారు సోమవారం ఎమ్మెల్యే రాములునాయక్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. కార్యక్రమంలో స్థానిక ఎంపీటీసీ అచ్చమ్మ పాల్గొన్నారు.

కొణిజర్ల: ప్రజలకు సంక్షేమ ఫలాలు అందాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్‌ చేస్తున్న కృషి మరవలేనదని వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్‌ కొనియాడారు. తహసీల్దార్‌ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన కల్యాణలక్ష్మీ, షాదిముబారక్‌ చెక్కుల పంపిణిలో ఎమ్మెల్యే ముఖ్య అతిఽథిగా పాల్గొని మాట్లాడారు. మాట్లాడుతూ ప్రతి కుటుంభానికి సీఎం అండగా ఉండేందుకు నిరంతరం శ్రమిస్తున్నారని తెలిపారు. రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలకు అన్ని మంచిరోజులే వస్తాయని, ప్రజలంతా కూడ ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ కృష్ణ, ఎంపీపీ గోసు మధు, జడ్పీటీసీ పోట్ల కవిత, ఎంపీడీవో రమాదేవి, ఈవోఆర్‌డి ప్రభాకర్‌రెడ్డి, డిటి విజయ్‌బాబు, ఆర్‌ఐ వినీల, యుడీసీ రాము, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షులు కోసూరి శ్రీనివాసరావు, సుడా డైరక్టర్‌ బండారు కృష్ణయ్య, సొసైటీ చైర్మన్‌ చెరుకుమల్లి రవి, సర్పంచ్‌లు, ఎంపీటీసలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-05-11T04:48:31+05:30 IST