పంచాయతీకో క్రీడా మైదానం

ABN , First Publish Date - 2022-05-18T03:58:17+05:30 IST

గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ప్రతి గ్రామంలో పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం తాజాగా క్రీడలను ప్రొత్సహించే దిశగా ప్రతి గ్రామ పంచాయతీకి ఒక ఆటస్థలం చొప్పున జిల్లాలోని 15 మండలాల్లో పరిధిలో 335 గ్రామ పంచాయతీల్లో క్రీడా మైదానాలను ఏర్పాటు చేయతలపెట్టింది.

పంచాయతీకో క్రీడా మైదానం
లోగో

- నాలుగు రోజుల క్రితం ప్రభుత్వం ఆదేశం

- రంగంలోకి దిగిన రెవెన్యూ అధికారులు

- స్థలాల ఎంపికకు కసరత్తు

(ఆంధ్రజ్యోతి, ఆసిఫాబాద్‌) 

గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ప్రతి గ్రామంలో పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం తాజాగా క్రీడలను ప్రొత్సహించే దిశగా ప్రతి గ్రామ పంచాయతీకి ఒక ఆటస్థలం చొప్పున జిల్లాలోని 15 మండలాల్లో పరిధిలో 335 గ్రామ పంచాయతీల్లో క్రీడా మైదానాలను ఏర్పాటు చేయతలపెట్టింది. ఇందుకు గానూ ప్రతి పంచాయతీలో జనా భా, స్థల లభ్యతను బట్టి ఎకరం నుంచి ఎకరంనర వరకు స్థలాన్ని సేకరించాలని  కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. దీంతో గ్రామాలు, మారుమూల జిల్లాల్లో క్రీడాకారులు నైపుణ్యాలను మెరుగు పరుచుకోవ డానికి అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఈ మేరకు కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అదనపు కలెక్టర్‌ వరుణ్‌ రెడ్డిలు రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

- ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు..

ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నాలుగు రోజులుగా జిల్లా వ్యాప్తం గా రెవెన్యూ అధికారులు, సర్వేయర్లు స్థలాలను అన్వేషించే పనిలో ప డ్డారు. పల్లె ప్రకృతి వనాల తరహాలోనే క్రీడా మైదానాలను అభివృద్ది చేయటం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు, ముఖ్యంగా యువతీ యువకులు శారీక మానసిక నైపుణ్యాలను పెంపొదించటంతో క్రీడలను అభివృద్ధి చేయవచ్చన్న లక్ష్యంతో గ్రామ క్రీడామైదానాలకు శ్రీకారం చుట్టిందని చెబుతున్నారు. అంతేకాకుండా మార్పుతున్న ప్రస్తుత సమకాలిన పరిస్థితిల్లో ప్రతి మనిషికి శారీక వ్యాయం అవసరమని భావించినందు వల్ల గ్రామాల్లో వాకింగ్‌, రన్నింగ్‌ వంటి భౌతిక కార్యక లాపాల కోసం ఈ మైదానాలు ఉపయోగపడుతాయని ప్రభుత్వం ఉద్దేశ్యంగా కన్పిస్తోంది. ప్రస్తుతం సేకరించే స్థలాన్ని బట్టి క్రీడామైదా నాలను ఏర్పాటు చేసే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ముఖ్యంగా తక్కువ జనాభా ఉన్న గ్రామ పంచాయతీల్లో ఆ గ్రామాల జనాభా అవసరాలను బట్టి అర ఎకర స్థలాన్ని సేకరించి క్రీడా మైదానాలను తయారు చేస్తారు. అలాగే జనాభా కొంచం ఎక్కువగా ఉండే గ్రామాల్లో ఎకరం నుంచి ఎకరంనర వరకు అభివృద్ధి చేస్తారు. అలాగే మేజర్‌ పంచాయతీల్లో ఎకరం నుంచి ఐదు ఎకరాల వరకు వివిధ క్రీడాంశాలకు ఉపయోగించుకనేలా మైదానాలను ఏర్పాటు చేయనున్నారు. అయితే ప్రతీ మైదానంలో ప్రధానంగా మూడు అంశాలను మాత్రం ప్రమా ణికంగా నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇందులో ప్రధానంగా క్రికెట్‌ మైదానం, వాలీబాల్‌తో పాటు రన్నింగ్‌ ట్రాక్‌లను నిర్వహిస్తారు. అర ఎకరా విస్తీర్ణంలో ఏర్పాటు చేసే మైదానాల్లో 200 మీటర్ల నిడివితో రన్నింగ్‌ ట్రాక్‌, వాలీబాల్‌ కోర్టు, క్రికెట్‌ మైదానాన్ని ఏర్పాట్లు చేస్తారు. అలాగే ఎకరం, ఎకరంన్నర స్థలంలో 400 మీటర్ల రన్నింగ్‌ ట్రాక్‌, వాలీబాల్‌కోర్టు, క్రికెట్‌ మైదానాన్ని రూపొందిస్తారు. ఆపైబడినవిస్తీర్ణంలో స్థలం లభిస్తే ఈ మూడు క్రీడాంశాలతో పాటు ఇతర క్రీడలకు సంబంఽ దించిన కోర్టులను ఏర్పాటు చేయాలని సంకల్పించారు. ఇందుకు సంబంఽఽ దించి రెవిన్యూ అధికారులు స్థలాలను గుర్తించే పనిలో ఉండగా, కొన్ని చోట్ల స్థలం అందుబాటులో ఉండడంతో అక్కడ సర్వే పనులు జరుగు తున్నాయి. 

- ఆసిఫాబాద్‌లో 12 ఎకరాల్లో..

జిల్లా కేంద్రమైన ఆసిఫాబాద్‌లో 12 ఎకరాల విస్తీర్ణంలో అతి పెద్ద క్రీడా మైదానాన్ని ఏర్పాటు చేస్తున్నా రు. ఇందుకు సంబంధించి పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఆసిఫాబాద్‌ మండల శివారులోని ఐటీడీఏకు చెందిన ఉద్యాన వనంలో ఖాళీగా ఉన్న స్థలాన్ని స్టేడియం నిర్మాణం కోసం కేటాయించారు. ప్రస్తుతం ఇక్కడ నేలను చదును చేసే పనులు, ముళ్లపొదల తొలగింపు వంటి పనులు జరుగుతున్నాయి. స్టేడియం లో రన్నింగ్‌, వాకింగ్‌ ట్రాక్‌లతో పాటు క్రికెట్‌, వాలీబాల్‌, బ్యాడ్మింటన్‌ వంటి ప్రధానమైన క్రీడల సంబంధించిన కోర్టులను కూడా ఏర్పాటు చేయను న్నారు. ఆసిఫాబాద్‌లో ఇప్పటికే కోర్టు అథార్టికి చెందిన క్రీడా మైదానం అందుబాటులో ఉంది. అయితే ప్రస్తుతం ఆ మైదానాన్ని పోలీసు శాఖ అవసరాలకు ఉప యోగిస్తున్నారు. తాజాగా నిర్మించే స్టేడియంతో పాటు ఈ రెండు మైదానాలు అందుబాటులోకి వస్తే జిల్లాలో అన్ని రకాల క్రీడలకు మైదానాలు అందుబాటులోకి వస్తాయని చెబుతున్నారు. 

అన్ని పంచాయతీల్లో మైదానాలు ఏర్పాటు..

- రమేశ్‌, జిల్లా పంచాయతీ అధికారి, ఆసిఫాబాద్‌

ప్రభుత్వం అన్ని గ్రామ పంచాయతీల్లో క్రీడామైదానాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో సాధ్యమైన మేర స్థలాలను ఎంపిక చేసేందుకు నిర్ణయించాం. ఇందుకు సంబంధించి కార్యాచరణ ప్రారం భించాం. ఆసిఫాబాద్‌లో మైదానం ఏర్పాటు పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి. 

Updated Date - 2022-05-18T03:58:17+05:30 IST