(అమలాపురం-ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఎన్నికల సంఘం తొలివిడతలో జరిగే అమలాపురం డివిజన్లోని పంచాయతీల ఎన్నికల నిర్వహణకు శనివారం షెడ్యూల్ను విడుదల చేసింది. అమలాపురం రెవెన్యూ డివిజన్ పరిధిలోని పదహారు మండలాల్లో ఉన్న 273 గ్రామ పంచాయతీల్లోని సర్పంచ్లు, వార్డు సభ్యులతో పాటు 3232 పోలింగ్ స్టేషన్లలో ఈ ఎన్నికల ప్రక్రియ నిర్వహిస్తారు. శనివారం నోటిఫికేషన్ జారీ అయింది. దీని ప్రకారం ఈనెల25న నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుంది. నామి నేషన్ల స్వీకరణకు జనవరి 27 చివరిరోజుగా నిర్ణయించారు. 28వ తేదిన నామినేషన్ల పరిశీలన, అక్కడి నుంచి 31 వరకు నామినేషన్ల ఉపసం హరణ, తుది జాబితా ప్రకటన వెలువడనుంది ఫిబ్రవరి 5వ తేదిన ఆయాపంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తారు. అదేరోజు సాయంత్రం ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమై ఫలితాలు ప్రకటిస్తారు. ఉదయం 6.30 గంటల నుంచి మధ్యామ్నం 3.30 గంటల వరకు పోలింగ్ జరుగు తుందని, ఆ తరువాత ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతుందని ఎన్నికల సంఘం షెడ్యూల్లో పేర్కొంది.