సర్పంచలు పంచాయతీల ఆదాయాన్ని పెంచాలి

ABN , First Publish Date - 2021-07-25T05:18:31+05:30 IST

సర్పంచలు గ్రామాలలో మౌలిక వసతులను మెరుగుపరచి గ్రామపంచాయతీల ఆదాయాన్ని పెంచాలని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శిక్షణ సంస్థ డైరెక్టర్‌ మురళి సూచించారు.

సర్పంచలు పంచాయతీల ఆదాయాన్ని పెంచాలి
సర్టిఫికెట్లు పంపిణీచేస్తున్న డైరెక్టర్‌ మురళి, జేసీ ప్రశాంతి, సీఈవో చైతన్య తదితరులు

గుంటూరు, జూలై 24 (ఆంధ్రజ్యోతి): సర్పంచలు గ్రామాలలో మౌలిక వసతులను మెరుగుపరచి గ్రామపంచాయతీల ఆదాయాన్ని పెంచాలని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శిక్షణ సంస్థ డైరెక్టర్‌ మురళి సూచించారు. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల నిధులతో శాశ్వత ఆదాయం వచ్చేపనులపై ఖర్చు చేయాలన్నారు. జడ్పీ మీటింగ్‌హాల్‌ లో శనివారం సర్పంచల శిక్షణ తరగతుల ముగింపు సభలో ఆయన ప్రసంగించారు. కార్యక్రమానికి డీపీవో కేశవరెడ్డి అధ్యక్షత వహి ంచారు. ప్రధానంగా గ్రామాలలో మౌలిక వసతులు మెరుగుపడితే వలసలు తగ్గుతాయన్నారు. పట్టణాలు, నగరాలలోని అన్ని సౌకర్యాల ను ప్రభుత్వాలు గ్రామాలలో కల్పిస్తున్నట్లు చెప్పారు. జాయింట్‌ కలెక్టర్‌ (సచివాలయాలు, స్థానిక సంస్థలు) పి.ప్రశాంతి మాట్లాడుతూ గ్రామపంచాయతీల్లో క్షేత్రస్థాయిలో సమస్యలను పరిష్కరించాలన్నారు. గ్రామీణప్రాంతాలు అభివృద్ధి చెందితేనే దేశం అన్నిరంగాలలో ముందుంటుందన్నారు. సమావేశంలో జడ్పీ సీఈవో డి.చైతన్య, డీఎల్పీవో లక్ష్మణరావు తదితరులు ప్రసంగించారు. ఈ సందర్భంగా శిక్షణ పూర్తయిన సర్పంచలకు సర్టిఫికెట్లు పంపిణీ చేశారు.

Updated Date - 2021-07-25T05:18:31+05:30 IST