జగన్ .. ఆంధ్రప్రదేశ్ ను అడుక్కునే రాష్ట్రంగా మారుస్తావా?: పంచుమర్తి

ABN , First Publish Date - 2022-04-17T00:04:16+05:30 IST

జగన్ .. ఆంధ్రప్రదేశ్ ను అడుక్కునే రాష్ట్రంగా మారుస్తావా?: పంచుమర్తి

జగన్ .. ఆంధ్రప్రదేశ్ ను అడుక్కునే రాష్ట్రంగా మారుస్తావా?: పంచుమర్తి

అమరావతి: జగన్ రెడ్డీ నీస్వార్థం, దోపిడీకోసం బహుళార్థసాధక ప్రాజెక్ట్  అయిన పోలవరాన్ని బ్యారేజీగా మార్చి, అన్నపూర్ణగా పిలిచే ఆంధ్రప్రదేశ్ ను అడుక్కునే రాష్ట్రంగా మారుస్తావా? అని  టీడీపీ రాష్ట్రప్రధాన కార్యదర్శి  పంచుమర్తి అనురాధ ప్రశ్నించారు. శనివారం  అనురాధ మీడియాతో మాట్లాడుతూ.. ’’పోలవరం ఎత్తు తగ్గించాల్సిన దుస్థితి ఎందుకు వచ్చిందో, నిర్మాణానికి అవసరమైన నిధులను కేంద్రం నుంచి ఎందుకు  తేలేకపోతున్నావో ప్రజలకు సమాధానం చెప్పు?కేంద్ర జలశక్తిశాఖ నివేదిక పోలవరం పనుల్లో జగన్మోహన్ రెడ్డి పనితనాన్ని ఎండగట్టింది.మూడేళ్లలో 10 శాతం పనులు కూడా చేయలేదని తేల్చింది. టీడీపీ హాయాంలో ఐదేళ్లలో 70 శాతం పనులు జరిగితే, జగన్ జమానాలో మూడేళ్లలో 7శాతం పనులు చేశారు’’ అని పంచుమర్తి అనురాధ మండిపడ్డారు.  


‘‘నిర్వాసితుల పరిహారంలో కూడా ఈ ప్రభుత్వం, ముఖ్యమంత్రి అవినీతికి పాల్పడటం బాధాకరం.జగన్ అవినీతి, చేతగానితనం... కేసుల భయమే పోలవరానికి శాపాలుగా మారాయి.డయాఫ్రమ్ వాల్ ఎంతమేరకు దెబ్బతిన్నది, దాని నిర్మాణానికి ఏం చర్యలు తీసుకుంటున్నారన్న కేంద్ర జలశక్తి శాఖ ప్రశ్నలకు ముఖ్యమంత్రి వద్ద సమాధానం లేదు.అధికారాన్ని చేపట్టిన ఈ మూడేళ్లలో డయాఫ్రమ్ వాల్‌కు సంబంధించి ప్రాథమికమైన అధ్యయనం చేయకుండానే అది దెబ్బతిన్నదని ఎలా నిర్ధారించారు?కాఫర్‌ డ్యాం నిర్మించడం వల్లే డయాఫ్రమ్ వాల్‌ దెబ్బతిన్నదంటూ జగన్‌ అడ్డగోలుగా బుకాయిస్తూ తప్పించుకోవాలని చూస్తున్నాడు.దెబ్బతిన్న ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ పూర్తిచేయడానికి, నిస్సిగ్గుగా మూడేళ్లు పడుతుందంటూ అంతిమంగా ప్రాజెక్ట్ నే పడుకోబెట్టాలని ముఖ్యమంత్రి చూస్తున్నాడు.రాష్ట్రంలోని ఇసుకరీచ్ లను గంపగుత్తగా దక్కించుకున్న సంస్థ, ప్రాజెక్ట్ నిర్మాణానికి ఇసుక సరఫరా చేసేది లేదని తెగేసి చెప్పినా, ముఖ్యమంత్రి స్పందించలేదు.చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే 2020 మే నాటికి ప్రాజెక్ట్ ని పూర్తి చేసి, రాష్ట్రానికి తాగు, సాగునీరు అందించడంతో పాటు, విద్యుత్ కష్టాలు లేకుండా చేసేవారు. ఏపీకి సాగు, తాగునీరు అందించే ప్రాజెక్ట్ తో ఆటలాడుతూ, నన్నెవరూ ఏమీపీకలేరంటూ బీరాలుపోతున్న జగన్ రెడ్డి కోరలు పీకడానికి రాష్ట్ర రైతాంగం నాగళ్లు, గొర్రులు, చర్నాకోళ్లతో సిద్ధంగా ఉంది’’ అని పంచుమర్తి అనురాధ ధ్వజమెత్తారు.

Updated Date - 2022-04-17T00:04:16+05:30 IST