‘వన్‌’పర్తి

ABN , First Publish Date - 2021-03-07T06:00:44+05:30 IST

పన్నుల వసూళ్లలో పంచాయతీ రాజ్‌ శాఖ దూసుకుపోతోం ది.

‘వన్‌’పర్తి
తాడిపర్తి గ్రామ పంచాయతీ కార్యాలయం

- పన్ను వసూళ్లలో రాష్ట్ర స్థాయిలో అగ్రస్థానం 

- ఈ ఏడాదీ చేరనున్న లక్ష్యం

- రూ.2.42 కోట్లకు గాను రూ.2.23 కోట్ల పన్నుల వసూలు


వనపర్తి, మార్చి 6 (ఆంధ్రజ్యోతి) : పన్నుల వసూళ్లలో పంచాయతీ రాజ్‌ శాఖ దూసుకుపోతోం ది. ఈ నెలాఖరుకు ఆర్థిక సంవత్సరం ముగింపు ఉండటంతో వంద శాతం పన్నుల వసూలు చేయ డమే లక్ష్యంగా ఆ శాఖ యంత్రాంగం పని చేస్తోంది. వనపర్తి జిల్లా వ్యాప్తంగా మార్చి మొదటి వా రంలోనే 91.87 శాతం పన్నులు వసూలు చేయగా, మరో 22 రోజుల్లో వంద శాతం పన్నులు వసూ లు చేసేందుకు సిద్ధమవుతోంది. 


లక్ష్యం రూ.2.42 కోట్లు

జిల్లాలో 255 పంచాయతీలు ఉన్నాయి. గతంలో ఉన్న పంచాయతీల సంఖ్యను పెంచడం, కొన్ని మేజర్‌ పంచాయతీలను మునిసిపాలిటీలుగా మార్చడంతో పంచాయతీ రాజ్‌ శాఖకు వచ్చే పన్నుల ఆదాయం తగ్గింది. పాత పంచాయతీలతో పాటు కొత్తగా ఏర్పడిన పంచాయతీల్లో కూడా ప్రభుత్వం అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతోంది. ఈ క్రమంలో జిల్లాలోని మొత్తం పంచాయ తీలకు కలిపి 2020-21 ఆర్థిక సంవత్సరానికి రూ.2,42,89,603 పన్నుల రూపేణ వసూలు చేయాల్సి ఉంది. మార్చి నెలాఖరుకు ఆర్థిక సంవత్సరం ముగింపు ఉన్నందున యంత్రాంగం పన్ను వసూళ్లపై దృష్టి సారించింది. వసూలు చేయాల్సిన మొత్తంలో రూ.1.82 కోట్లు పన్నుల రూపేణ వచ్చే ఆదా యం కాగా, రూ.60 లక్షల పైచిలుకు ఇతర మార్గాల ద్వారా వచ్చే ఆదాయంగా యంత్రాంగం పే ర్కొంది. ఇప్పటి వరకు వసూలు చేసిన పన్నులు రూ.2.23 కోట్లు కాగా, మిగిలిన రూ.19 లక్షలను మార్చి నెలాఖరులోగా వసూలు చేయాల్సి ఉంది. ఇదిలా ఉంటే కొన్ని మండలాలకు సంబంధించిన పన్నులు వంద శాతం పూర్తయ్యాయి. మార్చి నెలాఖరు కంటే ముందే పన్నుల వసూలు పూర్తయ్యే అవకాశం ఉన్నది.


మూడేళ్లుగా అగ్రగామిగా..

వనపర్తి జిల్లాగా ఏర్పడినప్పటి నుంచి పన్నుల వసూళ్లలో వంద శాతం లక్ష్యాన్ని సాధిస్తోంది. గడిచిన మూడేళ్లుగా పన్ను వసూళ్లలో రాష్ట్రస్థాయిలో జిల్లా అగ్రస్థానంలో నిలుస్తోంది. గతంతో పో లిస్తే చాలా వరకు గ్రామాలు అభివృద్ధి బాటలో పయనిస్తున్నాయి. నిధులు లేక సతమతమవు తున్న పరిస్థితి నుంచి ప్రస్తుతం పుష్కలంగా నిధులు విడుదలవుతున్నాయి. మొక్కల పెంపకం, క్లీనింగ్‌, డం పింగ్‌ యార్డులు, శ్మశాన వాటికలు యుద్ధప్రాతిపదికన పూర్తవుతున్నాయి. కొన్ని చోట్ల అభివృద్ధి ప నులకు సంబంధించి బిల్లులు సమయానికి రావడం లేదని అసంతృప్తి ఉన్నా, మిగతా వాటికి ని ధుల విడుదల జరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో గ్రామాలకు వెళ్లే నిధులే కాకుండా, రావాల్సిన పన్నులపై కూడా ప్రభుత్వం దృష్టి సారించింది. అన్ని జిల్లాలు వంద శాతం పన్నుల లక్ష్యం చేరుకో వాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. పక్క ప్రణాళిక, రోజు వారీ పర్యవేక్షణతో ఈసారి కూడా జి ల్లా పన్ను వసూళ్లలో అగ్రస్థానంలో ఉండటం ఖాయంగానే కనిపిస్తోంది.

Updated Date - 2021-03-07T06:00:44+05:30 IST