‘పండగలా టీడీపీ సభ్యత్వ నమోదు’
Published: Wed, 29 Jun 2022 23:31:21 IST

బాలిగాంలో టీడీపీ సభ్యత్వ నమోదులో పాల్గొన్న గౌతు శిరీష
v>
హరిపురం: ప్రతి గ్రామంలోనూటీడీపీ సభ్యత్వ నమోదును పండగలా చేపట్టాలని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పలాస నియోజకవర్గ ఇన్‌చార్జి గౌతు శిరీష కోరారు. బాలిగాం గ్రామంలో బుధవారం టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పరిశీలించారు. ప్రతి కార్యకర్త, గ్రామ కమిటీ సభ్యులు సభ్యత్వ నమోదులో భాగస్వామ్యమై పార్టీపటిష్ఠతకు కృషిచేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు భావన దుర్యోధన, డిల్లేశ్వరరావు, గున్న శ్రీనివాసరావు, రఘుపతి, రాజేష్, గోవిందరాజు తదితరులు పాల్గొన్నారు.
యువతకు ప్రాధాన్యం
నరసన్నపేట: గ్రామాల్లో టీడీపీ బలోపేతానికి పార్టీ సభ్యత్వ నమోదులో యువతకు ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుందని ఆ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు బలగ నాగేశ్వరరావు అన్నారు. బుధవారం నరసన్నపేట, తామరాపల్లి గ్రామాల్లో సభ్యత్వ నమోదు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వ అక్రమా లను ప్రజలకు తెలియజేసేందుకు క్రియాశీలక కార్యకర్తలు సిద్ధంగా ఉండాల న్నారు. కార్యక్రమంలో నాయకులు బోయిన ఆనంద్, కింజరాపు రామారావు, జామి వెంకట్రావు, కోరాడ రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.