వైభవంగా పాండురంగస్వామి రథోత్సవం

Published: Fri, 27 May 2022 00:38:23 ISTfb-iconwhatsapp-icontwitter-icon
వైభవంగా పాండురంగస్వామి రథోత్సవం

బొమ్మనహాళ్‌, మే 26: మండలంలోని ఉంతకల్లు గ్రామంలో శ్రీ రుక్మిణి పాండు రంగస్వామి రథోత్సవం గురువారం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రతి యేటా వైశాఖ మాసంలో స్వామి వారి రథోత్సవంను నిర్వహిస్తారు. గత రెండేళ్లు కరోనా నేపథ్యంలో భాగంగా రథోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించలేదు. ఈ యేడాది రథో త్సవం జరపడంతో భక్తులు తరలివచ్చి స్వామి వారికి పూజలు నిర్వహించారు. ఉదయాన్నే స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, సాయంత్రం 5 గంటలకు రథాన్ని ఊరేగించారు. ఈ రథోత్సవ కార్యక్రమానికి పండరీపుర పీఠాధిపతి గోపాల్‌ రావు మహరాజ్‌, ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఎస్‌ఐ జి శివ బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ఛైర్మన్‌ మెట్టు హనుమంతరెడ్డి, కమిటీ సభ్యులు మెట్టు వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.