పనీర్‌ ఘీ రోస్ట్‌

ABN , First Publish Date - 2022-02-16T18:53:22+05:30 IST

ఎండు మిర్చి- అయిదు, ధనియాలు- స్పూను, జీలకర్ర- స్పూను, మిరియాలు, లవంగాలు- అర స్పూను, వెల్లుల్లి రెబ్బలు - మూడు, చింతపులుసు

పనీర్‌ ఘీ రోస్ట్‌

కావలసిన పదార్థాలు: ఎండు మిర్చి- అయిదు, ధనియాలు- స్పూను, జీలకర్ర- స్పూను, మిరియాలు, లవంగాలు- అర స్పూను, వెల్లుల్లి రెబ్బలు - మూడు, చింతపులుసు- రెండు స్పూన్లు, పనీరు ముక్కలు- పావు కిలో, పెరుగు- రెండు స్పూన్లు, నెయ్యి- నాలుగు స్పూన్లు, ఉల్లి- అర కప్పు, కరివేపాకు రెబ్బలు- రెండు, ఉప్పు, నీళ్లు, నూనె- తగినంత.


తయారుచేసే విధానం: ముందుగా మసాలా పేస్టును తయారుచేసుకోవాలి. దీని కోసం పాన్‌లో నెయ్యి వేసి కరిగించి ఇందులో మిర్చి, ధనియాలు, జీలకర్ర, లవంగాలు, మిరియాలు వెల్లుల్లి వేయించాలి. చల్లారాక మిక్సీలో పొడిగా చేయాలి. ఇంకో పాన్‌లో కాస్త నెయ్యి వేసి అందులో పనీరు ముక్కల్ని బంగారు రంగులోకి వచ్చేలా వేయించి పక్కన పెట్టాలి. పెద్ద పాన్‌లో రెండు స్పూన్ల నెయ్యి వేసి ఉల్లి ముక్కలు వేయించాలి. పసుపును కలపాలి. ఆ తరవాత మసాలా పొడిని వేసి పది నిమిషాలు ఉడకనివ్వాలి. పెరుగునూ వేసి అంతా కలియ కలపాలి. ఉప్పూ కలిపాక పనీరును వేయాలి. కరివేపాకునూ కలిపి. ఓ నిమిషం తరవాత స్టవ్‌ కట్టేస్తే పనీరు ఘీ రోస్ట్‌ సిద్ధం.

Updated Date - 2022-02-16T18:53:22+05:30 IST