పంట సాగు హక్కు పత్రాలపై రైతులకు అవగాహన

ABN , First Publish Date - 2021-06-17T03:38:54+05:30 IST

మండలంలోని చెల్లాయపాళెంలో కౌలు రైతులకు పంట సాగు హక్కు పత్రాలపై మండల వ్యవసాయాఽధికారి సురేంద్రరెడ్డి ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు.

పంట సాగు హక్కు పత్రాలపై రైతులకు అవగాహన
పంట సాగు హక్కు పత్రాలపై రైతులకు అవగాహన కల్పిస్తున్న వ్యవసాయాధికారి

బుచ్చిరెడ్డిపాళెం, జూన్‌ 16: మండలంలోని చెల్లాయపాళెంలో కౌలు రైతులకు పంట సాగు హక్కు పత్రాలపై మండల వ్యవసాయాఽధికారి సురేంద్రరెడ్డి ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న తహసీల్దారు షఫీమాలిక్‌ మాట్లాడుతూ పంట సాగు హక్కు పత్రాల గురించి వివరిస్తూ  రైతులకు పంట రుణాలు, పంట  నష్టపరిహారం, బీమా, సున్నా వడ్డీ, మద్దతు ధరతో ప్రభుత్వం కొనుగోలు చేసే పంట   ప్రయోజనాలకు ఉపయోగపడుతుందని తెలిపారు. దేవాదాయ భూములు చేస్తున్న కౌలు రైతులు కూడా రెవెన్యూ అధికారులను సంప్రదించి ఈ పత్రాలు పొందవచ్చన్నారు. 11 నెలల కాలపరిమితితో అందజేసే పంట సాగు హక్కు పత్రాలతో వివిధ రకాల విత్తనాలపై రాయితీ పొందవచ్చని వ్యవసాయాధికారి తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ రావూరు రజనీకాంత్‌, వీఆర్వో నారాయణరెడ్డి, సెక్రటరీ నారాయణరావు, వీఏఏ కళ్యాణి, ఏఎంసీ డైరెక్టర్‌ కనిసిరి అరుణ, ఏఏబీ కమిటీ మెంబర్లు, సచివాలయ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-17T03:38:54+05:30 IST