బరువును తగ్గించే బొప్పాయి

ABN , First Publish Date - 2021-09-06T05:30:00+05:30 IST

బొప్పాయి... ఏడాది పొడవునా లభించే పండు ఇది. ఇందులో పోషకాలు పుష్కలం. బొప్పాయిని తరుచుగా తీసుకుంటే అనేక ప్రయోజనాలు చేకూరుతాయి...

బరువును తగ్గించే బొప్పాయి

బొప్పాయి... ఏడాది పొడవునా లభించే పండు ఇది. ఇందులో పోషకాలు పుష్కలం. బొప్పాయిని తరుచుగా తీసుకుంటే అనేక ప్రయోజనాలు చేకూరుతాయి. 

బొప్పాయి పండును బ్రేక్‌ఫా్‌స్టలోనూ, స్నాక్స్‌గానూ తీసుకోవచ్చు. తీపిగా ఉండే ఈ పండులో అనేక పోషకాలున్నాయి. ఇందులోని కె-విటమిన్‌ వల్ల ఎముకలు బలంగా తయారవుతాయి. ఒక మీడియం సైజు బొప్పాయిలో 120 కేలరీలుంటాయి. 30 గ్రాముల కార్బోహైడేట్ర్స్‌ ఉంటే ఇందులోనే 5 గ్రాముల పీచు పదార్థం, 18 గ్రాముల చక్కెర, రెండు గ్రాముల ప్రొటీన్లు ఉంటాయి. ఇది శరీరంలోని చక్కెర శాతాన్ని నియంత్రిస్తుంది. డయాబిటిస్‌ బారిన పడినవారు ఈ పండును తీసుకుంటే మంచిది. బొప్పాయిలో తక్కువ పీచుపదార్థంతో పాటు నీటిశాతం అధికం. ఇందులోని పపాయన్‌ ఎంజైమ్‌తో జీర్ణక్రియ సులువుగా జరుగుతుంది. తక్కువ కేలరీలుండటం వల్ల బరువు తగ్గాలనుకునే వారు ఎంచుకోదగిన పండు ఇది. ఒబెసిటీ కూడా దరి చేరదు. బ్లడ్‌ ప్రెషర్‌ను నియంత్రిస్తుంది. తద్వారా గుండెకు మంచిది. ఇకపోతే చర్మానికి మేలు చేస్తుంది. గాయాలను త్వరగా మాన్పే శక్తి ఉంది. దీంతో పాటు ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్‌ స్కిన్‌ డామేజ్‌ను నివారిస్తాయి. చర్మం కాంతిమంతంగా ఉండేందుకు సహకరిస్తుంది. విటమిన్‌ ఎ ఇందులో పుష్కలం. దీనివల్ల కంటికి మంచిది. జుట్టు ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా వ్యాధి నిరోధక శక్తిని పెంచే అద్భుతమైన ఫలమిది. 


దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్‌తో పాటు ఫ్లేవనాయిడ్స్‌, పాలీఫినాల్స్‌ వల్ల దగ్గు, జలుబు లాంటివి దరిచేరకుండా ఉంటాయి. పీరియడ్స్‌ సమయంలో బొప్పాయి తింటే కడుపు నొప్పి తగ్గుతుంది. అయితే గర్భిణులు ఈ పండును తినకూడదు. కొందరికి బొప్పాయి వాసన పడదు. అలాంటప్పుడు దీనికి నిమ్మరసం జతచేసి జ్యూస్‌ చేసుకుని తాగొచ్చు. 

Updated Date - 2021-09-06T05:30:00+05:30 IST