బొప్పాయి పంటకు వైరస్‌

ABN , First Publish Date - 2022-08-18T05:04:59+05:30 IST

బొప్పాయి పంటకు వైరస్‌ తెగులు సోకడంతో రైతన్నలు లబోదిబోమంటు న్నారు. పెట్టిన పెట్టుబడి కూడా రాదంటూ ఆవేదన చెందుతున్నారు. మండలంలో 20 ఎకరాల్లో బొప్పాయి పంటను రైతులు సాగు చేశారు. అప్పులు చేసి ఎకరాకు రూ.లక్ష చొప్పున ఖర్చు పెట్టారు. పంట కాపుకు వచ్చే సరికి తొమ్మిది నెలలు పడుతుంది. 9 నెలల్లో ఫస్ట్‌ క్రాస్‌ కటింగ్‌ చేయాల్సి ఉంటుంది.

బొప్పాయి పంటకు వైరస్‌
వైరస్‌ సోకిన బొప్పాయి తోట

నష్టపోతున్న రైతన్నలు

ఎకరాకు రూ.లక్ష చొప్పున ఖర్చు

పెట్టుబడి కూడా రాలేదంటూ ఆవేదన 

రామాపురం, ఆగస్టు 17: బొప్పాయి పంటకు వైరస్‌ తెగులు సోకడంతో రైతన్నలు లబోదిబోమంటు న్నారు.  పెట్టిన పెట్టుబడి కూడా రాదంటూ ఆవేదన చెందుతున్నారు. మండలంలో 20 ఎకరాల్లో బొప్పాయి పంటను రైతులు సాగు చేశారు. అప్పులు చేసి ఎకరాకు రూ.లక్ష చొప్పున ఖర్చు పెట్టారు. పంట కాపుకు వచ్చే సరికి తొమ్మిది నెలలు పడుతుంది. 9 నెలల్లో ఫస్ట్‌ క్రాస్‌ కటింగ్‌ చేయాల్సి ఉంటుంది. అయితే మొదటి కటింగ్‌లోనే పంట చేతికి అందక కాయలకు వైరస్‌ సోకి కాయ లోపల పురుగులు చేరి మెత్తబడి పోతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట దిగుబడి బాగా ఉందని, మార్కెట్‌లో రేట్లు కూడా అధికంగా ఉన్నాయని సంతోషించే సమయంలో ఇలా దెబ్బతీసిందని అంటున్నారు. కాగా రైతులు పంట సాగు చేసిన తర్వాత సంబంధిత అధికారులు తనిఖీ చేసి సలహాలు, సూచనలు ఇచ్చి ఉంటే పంట ఈ విధంగా దెబ్బతినేది కాదని రైతులు వాపోతున్నారు. 


ఎకరాకు రూ.లక్ష ఖర్చు చేశా

నేను మూడు ఎకరాల్లో బొప్పాయి పంట సాగు చేశా. ఎకరాకు రూ.లక్ష చొప్పున ఖర్చు చేశాను. మార్కెట్‌లో ధర బాగుం ది. ఇబ్బందుల నుంచి గట్టెక్కవచ్చనుకున్న సమ యంలో దెబ్బ తీసింది. 9 నెలలకు పంట మొదటి కోతలోనే వైరస్‌ సోకి కాయల్లో పురుగులు వచ్చాయి. దీనివల్ల కాయలు మెత్త పడిపోతున్నాయి. ప్రభుత్వం ఆదుకోవాలి. 

- ఖాదర్‌వల్లి, కొమ్మూరువాండ్లపల్లె, రాచపల్లె గ్రామం


పంటలపై అవగాహన కల్పిస్తాం

పంటను సాగు చేసిన రైతులు వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేస్తే ముందుగా అవగా హన కల్పిస్తాం. బొప్పాయి పంటలకు ఎక్కువగా పండు ఈగలు, దోమలు, కాయల పై వాలడంతో పంట దెబ్బతింటుంది. ముందు జాగ్రత్తగా పిచికారీ చేయాలి. 

- నాగమణి, హార్టికల్చర్‌ అధికారి, లక్కిరెడ్డిపల్లె

Updated Date - 2022-08-18T05:04:59+05:30 IST