ఆక్సిజన్‌ ప్లాంట్‌ సందర్శన

ABN , First Publish Date - 2021-05-09T05:24:10+05:30 IST

పేపర్‌ మిల్లులోని ఆక్సిజన్‌ ప్లాంటు పునరుద్ధరణకు చేపట్టాల్సిన చర్యలపై అంచనాలు రూపొందించి నివేదిక అందజేయాలని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ లక్ష్మీశ పేపర్‌మిల్లు ప్రతినిధులు సూరారెడ్డి, అశోక్‌కుమార్‌సింగ్‌ను కోరారు.

ఆక్సిజన్‌ ప్లాంట్‌ సందర్శన
ప్లాంట్‌ సందర్శిస్తున్న అధికారులు

రాజమహేంద్రవరం అర్బన్‌, మే 8: పేపర్‌ మిల్లులోని ఆక్సిజన్‌ ప్లాంటు పునరుద్ధరణకు చేపట్టాల్సిన చర్యలపై అంచనాలు రూపొందించి నివేదిక అందజేయాలని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ లక్ష్మీశ పేపర్‌మిల్లు ప్రతినిధులు సూరారెడ్డి, అశోక్‌కుమార్‌సింగ్‌ను కోరారు. ఇంటర్నేషనల్‌ పేపర్‌ మిల్లు ప్రాంగణంలో ఉన్న ఆక్సిజన్‌ ప్లాంటును శనివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆక్సిజన్‌ ప్లాంటు ఉత్పత్తి సామర్థ్యం, ప్రస్తుత స్థితిగతులు, రిపేర్లకు అవసరమైన నిధులకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం 25 శాతం సామర్థ్యంతో ఆక్సిజన్‌ ప్లాంటు పనిచేస్తోందని, దీంతో తమ ఫ్యాక్టరీ అవసరాలు తీరుతున్నాయని, అయితే లిక్విడ్‌ ఆక్సిజన్‌ ఉత్పత్తి కోసం 99 శాతం సామర్థ్యంతో పనిచేస్తేనే పూర్తిస్థాయిలో అవసరాలు తీరుతాయని పేపర్‌మిల్లు ప్రతినిధులు జేసీకి తెలియజేశారు. ప్రస్తుతం ప్లాంటులో రిపేర్లు కొంతవరకూ జరుగుతున్నాయని కూడా వారు చెప్పారు. దీనిపై జేసీ స్పందిస్తూ పూర్తి నివేదిక తమకు అందజేయాలని వారికి సూచించారు. జేసీ వెంట రాజమహేంద్రవరం సబ్‌ కలెక్టర్‌ అనుపమ అంజలి, నగరపాలక సంస్థ కమిషనర్‌ అభిషిక్త్‌ కిషోర్‌ ఉన్నారు.

Updated Date - 2021-05-09T05:24:10+05:30 IST