‘అమరవీరుల జిల్లాగా ఏర్పాటు చేయాలి’

ABN , First Publish Date - 2021-06-22T04:50:44+05:30 IST

‘అమరవీరుల జిల్లాగా ఏర్పాటు చేయాలి’

‘అమరవీరుల జిల్లాగా ఏర్పాటు చేయాలి’
కౌన్సిల్‌ సమావేశంలో మాట్లాడుతున్న చైర్‌పర్సన్‌ అనిత

పరకాల, జూన్‌ 21 : పరకాలను అమరవీరుల జిల్లాగా ఏర్పాటు చేయాలని కౌన్సి ల్‌ తీర్మానం చేసింది. సోమవారం పరకాల పురపాలక సంఘంలో చైర్‌ పర్సన్‌ సోదా అనిత అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ముందుగా కొత్త కౌన్సిలర్‌ బేజంకి పూర్ణచారి ప్రమాణ స్వీకారం చేయించారు. అధికార పార్టీ కౌన్సిలర్ల వార్డుల్లో మాత్రమే అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, ప్రతిపక్ష కౌన్సిలర్లకు ఎనిమిది నెలల క్రితం జరిగిన పనులకు సంబంధిత బిల్లులు ఇవ్వడం లేదని 21వ వార్డు కౌన్సిలర్‌ ఆర్‌పి. జయంత్‌లాల్‌ ఆరోపించారు. తరబడి తన వార్డులో స్వీపర్‌ లేడని 20వ వార్డు కౌన్సిలర్‌పి.జయమ్మ ఆరోపిస్తూ కమిషనర్‌ శేషుకు వినతిపత్రం అందించారు. రాజీపే ట సమీపంలో చెక్‌పోస్టు ఏర్పాటు చేయాలని ఆరోవార్డు కౌన్సిలర్‌ డి.మొగిలి కోరారు. 

టీఆర్‌ఎస్‌ వర్సెస్‌ బీజేపీ 

టీఆర్‌ఎస్‌.. బీజేపీ కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. టీఆర్‌ఎస్‌ కౌన్సిల ర్లకు అధికారులు సహకరిస్తున్నారని, వారి వార్డుల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నా యని జయంత్‌లాల్‌ ఆరోపించగా టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్‌ పాలకుర్తి గోపి పార్టీలకు కౌన్సి ల్‌ సమావేశానికి సంబంధం లేదని అనగా 8 నెలలుగా తన వార్డులో జరిగిన పనుల కు ఎందుకు బిల్లు రావడం లేదని ఇరువర్గాలు గొడవ పడ్డాయి. దీంతో కమిషనర్‌ శేషు, వైస్‌చైర్మన్‌ రెగూరి విజయపాల్‌రెడ్డి ఇరువర్గాలను శాంతింపజేశారు. 

పాటించని సమయపాలన..

ఉదయం 11 గంటలకు జరగాల్సిన సమావేశం 12గంటలకు ప్రారంభించారు. కమి షనర్‌, చైర్‌పర్సన్‌లు సమావేశం హాల్లో 11 గంటలకు వచ్చి కుర్చున్నారు. తీరిపాటిగా కౌన్సిలర్లు ఒక్క ఒక్కరుగా వచ్చేవరకు సమావేశం కొనసాగలేదు. చివరగా 11 అంశలతో ఏజెండాను చదివి అమోదింపచేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు ఒంటేరు సారయ్య, పోరండ్ల సంతోష్‌కుమార్‌, నల్లేల్ల జ్యోతి, అడప రాము, బండి రాణి, పసుల లావణ్య, భద్రయ్య, ఉమాదేవి, ఏకు రాజు, మడికొండ సంపత్‌కుమార్‌, దేవునూరి రమ్యకృష్ణ, గొర్రె స్రవంతి, కో ఆప్షన్‌ సభ్యలు, సిబ్బంది పాల్గొన్నారు.


Updated Date - 2021-06-22T04:50:44+05:30 IST