ఇంటికి చేరిన పరశురాములు

Jun 15 2021 @ 00:49AM
ఎర్రవల్లిలోని తమ ఇంటి వద్ద ఎల్లవ్వ, పరశురాములు

 ‘ఆంధ్రజ్యోతి’ కథనానికి స్పందన


మర్కుక్‌, జూన్‌ 14: మర్కుక్‌ మండలంలోని ఎర్రవల్లి గ్రామానికి చెందిన ఎడమ పరశురాములు మంగళవారం తన ఇంటికి చేరుకున్నాడు. కొన్ని రోజుల క్రితం కరోనా బారిన పడి పస్తులున్న పరశురాములు, అతని తల్లి ఎల్లవ్వ పరిస్థితిపై ‘ఆంధ్రజ్యోతి’లో వార్త ప్రచురితం కావడంతో మంత్రి హరీశ్‌రావు, ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతా్‌పరెడ్డి స్పందించారు. వారికి చికిత్స అందేలా ఏర్పాటు చేశారు. ఇటీవలే ఎల్లవ్వ ఆరోగ్యం కుదుటపడి ఇంటికి చేరుకుంది. సిద్దిపేట ఆసుపత్రిలో ఐసోలేషన్‌లో చికిత్స తీసుకున్న పరశురాములు మంగళవారం ఇంటికి చేరుకున్నాడు.  

Follow Us on: