ఆర్టీసీ ద్వారా ఇక నుంచి ఇంటికే పార్శిల్‌

ABN , First Publish Date - 2021-07-24T07:04:30+05:30 IST

ఆర్టీసీ మరో నూతన సేవకు శ్రీకా రం చుట్టబోతుంది. ఇప్పటికే పార్సిల్‌ కొరియర్‌ను ప్రారంభించిన ఆర్టీసీ అందులో సక్సెస్‌ కావడంతో మరో నూతన సేవను ప్రారంభించేందుకు కార్యాచరణ రూపొందిస్తోంది.

ఆర్టీసీ ద్వారా ఇక నుంచి ఇంటికే పార్శిల్‌

కార్గో సర్వీసు ద్వారా మరో నూతన సేవకు ఆర్టీసీ శ్రీకారం
పార్శిల్‌ కవర్స్‌ హోం డెలివరీ సర్వీసు ప్రారంభం
తొలుత నిజామాబాద్‌, బోధన్‌, బాన్సువాడ డిపోలలోనే సేవలు

సుభాష్‌నగర్‌, జూలైౖ 23: ఆర్టీసీ మరో నూతన సేవకు శ్రీకా రం చుట్టబోతుంది. ఇప్పటికే పార్సిల్‌ కొరియర్‌ను ప్రారంభించిన ఆర్టీసీ అందులో సక్సెస్‌ కావడంతో మరో నూతన సేవను ప్రారంభించేందుకు కార్యాచరణ రూపొందిస్తోంది. పార్సిల్‌ కవర్స్‌ హోం డెలివరీ చేసేందుకు సమాయత్తమవుతోంది. ఇప్పటి వరకు పార్సిల్‌ కొరియర్స్‌ బస్టాండ్‌ వరకే పరిమితం కాగా.. ఇకనుంచి హోం డెలివరీ ద్వారా ఇంటింటికీ పార్శిల్‌ కవర్స్‌ అం దించేందుకు చర్యలు చేపట్టింది. వినియోగదారులకు మెరుగై న సేవలు అందించేందుకు హోం డెలివరీ సేవలు ప్రారంభిస్తున్నట్లు రీజియన్‌ మేనేజర్‌ సుధా పరిమిళ తెలిపారు. పార్శి ల్‌ బుక్‌చేసే సమయంలో హోం డెలివరీ ద్వారా బుక్‌చేస్తే ఇం టి వద్దకే నేరుగా పార్శిల్‌ చేయబడుతుందని, ఒకవేళ హోం డె లివరీ ద్వారా బుక్‌ చేయకున్నా పార్శిల్‌ కౌంటర్‌ వద్దకు చేరుకున్న తర్వాత కూడా వినియోగదారుడు కోరినట్లైతే హోం డెలివరీ చేయబడుతుందన్నారు. ముందుగా ఈ సౌకర్యం నిజామాబాద్‌, బాన్సువాడ, బోధన్‌ పట్టణ పరిధి వరకే కల్పించబడుతుందని తెలిపారు. కవర్‌ ఒక కేజీ జీఎస్టీతో కలిపి 18 రూ పాయలు, పార్శిల్‌ 1కేజీ నుంచి 5కేజీల వరకు 18 రూపాయ లు, 11కేజీల నేంచి 49 కేజీల వరకు 36రూపాయలు, 50కేజీల పైన 54 రూపాయలు, 100కేజీలపైన ప్రతీ కిలోకు 1.50 పైస లు అదనంగా జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుందని ఆమె తెలిపారు. హోం డెలివరీ కోసం నిజామాబాద్‌ 91542 98716, బాన్సువా డ 91542 98720, బోధన్‌ 91542 98701, రీజనల్‌ ఎక్స్‌క్యూటీవ్‌ 98859 52825 నంబర్‌లను సంప్రదించాలని కోరారు.

Updated Date - 2021-07-24T07:04:30+05:30 IST