పనిమనుషుల కంటే హీనంగా చూస్తున్నారు.. అన్నం కూడా పెట్టడం లేదు.. ఓ వృద్ధజంట కష్టమిదీ.. కోర్టు ఏం తేల్చిందంటే..

ABN , First Publish Date - 2022-07-30T20:25:57+05:30 IST

కని, పెంచి, నడవడం నేర్పి సమర్థులుగా తీర్చిదిద్దిన తల్లిదండ్రులు వారు..

పనిమనుషుల కంటే హీనంగా చూస్తున్నారు.. అన్నం కూడా పెట్టడం లేదు.. ఓ వృద్ధజంట కష్టమిదీ.. కోర్టు ఏం తేల్చిందంటే..

కని, పెంచి, నడవడం నేర్పి సమర్థులుగా తీర్చిదిద్దిన తల్లిదండ్రులు వారు.. వయసు మీద పడి, శక్తి సన్నగిల్లడంతో పిల్లలకు భారమైపోయారు.. నలుగురు పిల్లలున్నప్పటికీ అనాథలుగా మిగిలారు.. ఇరుగు పొరుగు వారు ఇచ్చిన ఆహారంతో కాలం వెల్లదీస్తున్నారు.. చివరకు సహనం నశించి కోర్టు మెట్లు ఎక్కారు.. విచారించిన కోర్టు ఆ వృద్ధ దంపతులకు ఉపశమనం కలిగించింది.. మధ్యప్రదేశ్‌(Madhya pradesh) లోని ఇండోర్‌లో ఈ ఘటన జరిగింది. 


ఇది కూడా చదవండి..

Tomato: ముంబై మహిళ ప్రాణాలు తీసిన టమాటో.. టీవీ చూస్తూ మ్యాగీ తిన్న మహిళ చివరకు..


ఇండోర్‌ (Indore)లోని రాధిక కాలనీలో నివసిస్తున్న ఓంప్రకాష్, సూరజా దంపతులకు నలుగురు కుమారులు. నలుగురికీ పెళ్లిళ్లు అయ్యాయి. తల్లిదండ్రులు కష్టపడి సంపాదించినదంతా నలుగురు కుమారులకు సమానంగా పంచి ఇచ్చారు. ఆ తర్వాత నలుగురూ తమ తల్లిదండ్రులను పట్టించుకోవడం మానేశారు. కోడళ్లు కూడా వారితో దురుసుగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. వారిని పని మనుషులుగా చూసేవారు. అన్ని పనులు వారి చేత చేయించేవారు. ఆహారం కూడా సరిగ్గా పెట్టేవారు కాదు. వారు అనారోగ్యానికి గురైనప్పుడు వైద్యం కూడా చేయించేవారు కాదు. 


కొడుకులు అన్నం పెట్టకపోవడంతో ఆ వృద్ధ దంపతులు కొన్ని రోజులు బంధువుల ఇళ్ల దగ్గర, కొన్ని రోజులు సాయిబాబా గుడిలోని భోజనం చేసేవారు. చివరకు 2019లో ఒక న్యాయవాదిని ఆశ్రయించి తమ గోడును వివరించారు. ఆ న్యాయవాది కోర్టులో పిటిషన్ వేశారు. కేసు విచారించిన కోర్టు తుది తీర్పు వెలువరించింది. నలుగురు కుమారులు కలిసి భరణం కింద రూ.1.92 లక్షలు తల్లిదండ్రులకు చెల్లించాలని ఫ్యామిలీ కోర్టు ఆదేశించింది. అలాగే ఒక్కో కొడుకు ప్రతి నెల రూ.1500 (నెలకు మొత్తం రూ.6 వేలు) తల్లిదండ్రులకు ఇవ్వాలని, కోర్టు ఖర్చుల నిమిత్తం రూ.2 వేలు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. వృద్ధులైన తల్లిదండ్రుల పోషణ బాధ్యత కుమారులదేనని కోర్టు పేర్కొంది.

Updated Date - 2022-07-30T20:25:57+05:30 IST