అమ్మకు జేజే.. నాన్నకు జేజే....

ABN , First Publish Date - 2021-07-25T05:39:01+05:30 IST

తల్లిదండ్రులు వంద మంది గురువులతో సమానమంటారు. పిల్లలకు జీవితాన్నిచ్చి, తమ జీవితాలను త్యాగం చేసే గొప్ప త్యాగమూర్తులు వాళ్లు. ప్రపంచంలో వెలకట్టలేని ప్రేమంటూ ఉందంటే అది తల్లిదండ్రుల ప్రేమే. పిల్లల ఎదుగుదల కోసం, వారి ఆనందం కోసం తల్లిదండ్రులు తమను తాము కోల్పోతారు.

అమ్మకు జేజే.. నాన్నకు జేజే....

పిల్లల ఎదుగుదలకు సమిధలయ్యే తల్లిదండ్రులు
త్యాగానికి, నిస్వార్థానికి నిలువెత్తు ప్రతిరూపాలు
మారుతున్న కాలంలో ఎంతో మారిపోయిన పాత్ర
ఎంత చేసినా చివరకు మిగులుతున్నది వృద్ధాశ్రమాలే..
నేడు పేరెంట్స్‌ డే


ఆంధ్రజ్యోతి, భూపాలపల్లి

తల్లిదండ్రులు వంద మంది గురువులతో సమానమంటారు. పిల్లలకు జీవితాన్నిచ్చి, తమ జీవితాలను త్యాగం చేసే గొప్ప త్యాగమూర్తులు వాళ్లు.   ప్రపంచంలో వెలకట్టలేని ప్రేమంటూ ఉందంటే అది తల్లిదండ్రుల ప్రేమే.  పిల్లల ఎదుగుదల కోసం, వారి ఆనందం కోసం తల్లిదండ్రులు తమను తాము కోల్పోతారు. సమిధలుగా మారి పిల్లలకు ఆనందకర జీవితాలను ప్రసాదిస్తారు. కష్టాలు, కన్నీళ్లను దిగమింగుకుంటూ పిల్లలకు ఏ లోటూ రానివ్వకుండా చూసుకుంటారు.  కాలంతో పాటు తల్లిదండ్రుల పాత్ర కూడా  మారిపోతోంది.  పిల్లలు జీవితాల్లో స్థిరపడే దాకా ప్రతి అడుగులోనూ వారు ఎంతో కీలకంగా వ్యవహరిస్తున్నారు. తమ అనుభవాన్ని పిల్లల కోసం జాగ్రత్తగా వెచ్చిస్తున్నారు.  అయితే ఎంత చేసినా జీవిత చరమాంకంలో తల్లిదండ్రులకు వృద్ధాశ్రమాలే మిగులుతున్నాయి.  రెక్కలిచ్చి పిల్లలు ఎగిరిపోయిన తర్వాత, చివరాఖరుకు వాళ్లు ఒంటరిగా మిగిలిపోక తప్పడం లేదు.  వారి వెలకట్టలేని సేవలను మర్చిపోతున్న పిల్లలే  ఎక్కువ.    అనునిత్యం పిల్లల కోసం ఆరాటపడే తల్లిదండ్రులకు ఈ రోజు ప్రత్యేకం. ఇవ్వాళ పేరెంట్స్‌ డే.    ప్రతీ ఏటా జూలై నాలుగో ఆదివారం నాడు  ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు.  పిల్లల్లారా.. మీ  తల్లిదండ్రులకు నీరాజనం పలకండి!


ప్రేమతో పెంచేవాళ్లం...
- కె.సుగుణాదేవి, జడలపేట (భూపాలపల్లి జిల్లా)

 పిల్లలను ప్రేమతో పెంచాం. చిన్నతనం నుంచే నీతి కథలు, రామాయణం, మహాభారతం లాంటివి బోధించే వాళ్లం. బంధాలు, అ నుబంధాల గురించి చెప్పే వాళ్లం. నీతి, నిజాయితీ, ధైర్యం అలవార్చేవాళ్లం. బంధువులు, పెద్దలను గౌరవం ఎ లా గౌరవించాలో నేర్పాం. తప్పు చేస్తే దండించే వాళ్లం. చదువుతో పాటు ఆటలకు, ఈతకు పిల్లలు వెళ్లేవారు. దీంతో  మనోస్థైర్యం పెరిగింది.  కానీ, పరిస్థితులు  మారాయి. ఇప్పటి పిల్లలు  ఫోన్లకే పరిమితవుతున్నారు. యంత్రంలా తయారవుతున్నారు.

తల్లిదండ్రులే గురువులు..
- ఎస్‌.మురళీధర్‌, ప్రభుత్వ ఉపాధ్యాయుడు (చిన్నపెండ్యాల, జనగామ జిల్లా)

 పిల్లలకు మొదటి గురువులు తల్లిదండ్రులే.  తాము కష్టపడుతున్నా తమ పి ల్లలు సుఖంగా జీవించాలని కోరుకునే నిస్వార్థపరులు. అయితే సోషల్‌ మీడియా ప్రభా వం పిల్లలపై బాగా పడింది.  పిల్లలను సన్మార్గంలో తీసుకెళ్తేనే మంచి పెరేంట్స్‌గా సమాజం గుర్తిస్తుంది. చిన్నతనం నుంచే బంధాలు, బంధుత్వాల విలువలు నేర్పాలి. వృద్ధాశ్రమాల సంఖ్య తగ్గినప్పుడే అనుబంధాలు మిగులుతాయి.

Updated Date - 2021-07-25T05:39:01+05:30 IST